లాక్ డౌన్ 4.0 : రాష్ట్రాలు నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న కేంద్రం..

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం చాలా రంగాలకు సడలింపులను ఇవ్వడంతో అంతా యథాతథ స్థితికి వచ్చినట్టయింది. దేశవ్యాప్తంగా చాలాచోట్ల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం(మే 21) అన్ని రాష్ట్రాలకు దీనిపై ఓ లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని అందులో ఆదేశించింది.

'దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలి. ముఖ్యంగా రాత్రిపూట 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ తప్పనిసరిగా అమలుచేయాలి.' అని హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు.

States should ensure night curfew Centre Writes to States over Lockdown Guidelines

కరోనా నియంత్రణకు కంటైన్‌మెంట్ జోన్లలో పకడ్బందీ చర్యలు అమలుచేయాలని ఆదేశించారు. అంతకుముందు బుధవారం(మే 20)న ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసిన హోంమంత్రిత్వ శాఖ.. రాష్ట్రాల సమన్వయంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సేవలను మాత్రమే అనుమతించాలని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+