Power Star: పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ అంతే, ఆయన ఆశయాలు, గాలి జనార్దన్ రెడ్డి !
బళ్లారి/బెంగళూరు: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నేటి సమాజానికి ఆదర్శం అని, పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ అంతే, ఆయనకు ఎవ్వరూ సాటిలేరని మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆశయాలను మేము ముందుకు నడిపిస్తామని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. సినీరంగంలోనే కాకుండా సమాజ సేవలో పునీత్ రాజ్ కుమార్ కు ఎవ్వరూ సాటిరారని గాలి జనార్దన్ రెడ్డి సోదరులు అన్నారు. బళ్లారిలో నిలువెత్తు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాన్ని ఆ విష్కరించిన గాలి జనార్దన్ రెడ్డి పునీత్ రాజ్ కుమార్ తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్బంలో భారీ వ్యయంతో నిర్మించిన పార్క్ కూడా గాలి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రం మొత్తం పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు
స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. లక్షలాది మంది అభిమానులు పునీత్ రాజ్ కుమార్ అంతిమదర్శనం చేసుకుని ఆయనకు నివాళులు అర్పించారు. కర్ణాటకలో ఇప్పటికే అనేక జిల్లాల్లో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు.

బళ్లారిలో పునీత్ రాజ్ కుమార్ విగ్రహం
బళ్లారిలోని తాళూరు రోడ్డులో కురవళ్లిలోని ఎన్ క్లేవ్ లో పునీత్ రాజ్ కుమార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 6.5 అడుగుల ఎత్తు ఉన్న పునీత్ రాజ్ కుమార్ విగ్రహాన్ని మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అవిష్కరించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నేటి సమాజానికి ఆదర్శం అని మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

పునీత్ రాజ్ కుమార్ ఆశయాలు
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆశయాలను మేము ముందుకు నడిపిస్తామని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. సినీరంగంలోనే కాకుండా సమాజ సేవలో పునీత్ రాజ్ కుమార్ కు ఎవ్వరూ సాటిరారని గాలి జనార్దన్ రెడ్డి సోదరులు అన్నారు. బళ్లారిలో నిలువెత్తు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాన్ని ఆ విష్కరించిన గాలి జనార్దన్ రెడ్డి పునీత్ రాజ్ కుమార్ తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

బళ్లారిలో శక్తిధామ శాఖ
స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది వరకు మైసూరులో నిర్వహించిన శక్తిధామ శాఖను బళ్లారిలో ప్రారంభిస్తామని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. పునీత్ రాజ్ కుమార్ అభిమానుల్లో సజీవంగా ఉన్నారని, రాజ్ కుమార్ కు నిజమైన వారసుడు అనిపించుకున్న ఆయన మన మధ్యలేకపోయినా ఆయన చేసిన సేవలు అందరికి గుర్తుంటాయని గాలి జనార్దన్ రెడ్డి కొంచెం ఉద్వేగానికి లలోనై ప్రసంగించారు.

కేఎమ్ఎఫ్ అంబాసిడర్ గా !
గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేఎమ్ఎఫ్ (నందిని పాలు) అధ్యక్షుడిగా తాను పని చేసిన సమయంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారని, నందిని సంస్థలకు పాలు సరఫరా చేసే ప్రతిరోజు బాగుండాలని కోరుకునే వారని గాలి సోమశేఖర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా వేలాది మంది పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications