యువతిపై పినతండ్రి రేప్, ఆమె కూతురి హత్య: నిందితుడికి జీవిత ఖైదు

Stepdad gets life for raping teen, killing her baby
ముంబై: ఐదేళ్ల క్రితం సవతి కూతురుపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందుడి(పినతండ్రి)కి బాంబే హైకోర్టు జీవిత ఖైదును విధించింది. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన వాల్మికి థోరట్ అనే వ్యక్తి 13ఏళ్ల కూతురుపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఐదేళ్ల క్రితం అరెస్ట్ అయ్యాడు. కేసును విచారించిన కోర్టు నిందితుడు థోరట్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

జస్టిస్ విజయ కప్సే తహిల్రామని, జస్టిస్ అనిల్ మీనన్ లతో కూడిన ధర్మాసనం అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేల్చింది. ‘థోరట్ ఆ యువతిపై అత్యాచారం చేశాడనడానికి తగిని ఆధారాలున్నాయి. థోరట్ చేసిన అఘాయిత్యానికి ఫలితంగా ఆ యువతి గర్భవతి అయింది. ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపతో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన థోరట్.. ఆ పాపను గొంతునులిమి హత్య చేశాడు' అని న్యాయమూర్తులు తెలిపారు.

‘నేరం రుజువు కావడంతో నిందితుడు థోరట్‌కు జీవిత ఖైదు తగిన శిక్ష' అని పేర్కొన్నారు. కింది కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన పాప డిఎన్ఏ.. నిందితుడు థోరట్ డిఎన్ఏ ఒక్కటేనని వైద్య పరీక్షల్లో తేలిందని కోర్టు పేర్కొంది. ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదని అభిప్రాయపడింది.

కాగా, బాధితురాలి తల్లి భర్త చనిపోవడంతో నిందితుడు థోరట్ ఆమెను వివాహం చేసుకున్నాడు. 2007 నవంబర్‌ నెలలో తల్లి పని మీద బయటికి వెళ్లడంతో బాధిత యువతి ఒక్కతే ఇంట్లో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న థోరట్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతీ శుక్రవారం తల్లి బయటికి వెళ్లగానే బెదిరింపులకు గురిచేసి యువతిపై థోరట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇలా కొన్ని నెలలపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గర్భవతి అయింది. ఈ విషయం బాధితురాలి తెలియడంతో ఆమె నిలదీసింది. అయితే యువతిని చంపేస్తానని బెదిరింపులకు గురిచేయడంతో ఆమె బయటికి చెప్పలేదు. 2009 జనవరిలో బాధిత యువతి ఓ పాపకి జన్మనిచ్చింది. ఆ పాపతో ఇంటికి వచ్చిన యువతిని బెదిరింపులకు గురిచేసి, ఆ పాపని గొంతునులిమి చంపాడు థోరట్. దీంతో బాధిత యువతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+