మిథున్ చక్రవర్తి రోడ్‌షోపై రాళ్లు, బాటిళ్లతో దాడి: ఉద్రిక్తత
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న వేళ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) మిడ్నాపూర్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. అయితే, టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
మిడ్నాపూర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే, మిథున్ చక్రవర్తికి ఈ దాడిలో ఎలాంటి గాయాలు కాలేదని, రాళ్లు ఆయనకు తగల్లేదని పోలీసులు వెల్లడించారు.

మిడ్నాపూర్ కలెక్టరేట్ వద్ద మొదలైన మిథున్ చక్రవర్తి రోడ్ షో.. కేరనిటోల వైపు వెళ్తుండగా భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు మద్దతుగా ఆయన వెంట కదిలాయి. మిథున్ చక్రవర్తి, అగ్నిమిత్ర ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. బీజేపీ శ్రేణులు వారిని ప్రతిఘటించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్తితులను అదుపులోకి తెచ్చాయి.
Medinipur, West Bengal: Mithun Chakraborty says, "There is a lot of excitement and support for the BJP..." https://t.co/C1pPLOFcJW pic.twitter.com/Bz6sa3LfVA
— IANS (@ians_india) May 21, 2024
కాగా, రాళ్ల, బాటిళ్లతో దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలేనని అగ్నిమిత్ర ఆరోపించారు. బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయంతోనే ఇలా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. మిథున్ చక్రవర్తి వంటి దిగ్గజ నటుడిని అగౌరపరిచే స్థాయికి టీఎంసీ చేరుకుందని విమర్శించారు. టీఎంసీ శ్రేణులే హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మరోవైపు, టీఎంసీ నేత త్రినాంకూర్ భట్టాచార్య బీజేపీపై విమర్శలు గుప్పించారు. తాము ఎలాంటి దాడులు చేయలేదని.. రోడ్ షో ప్లాప్ కావడంతో బీజేపీ కొత్త నాటకాలాడుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications