వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రణరంగంగా జోధ్‌పూర్.. జెండా తీయడంతో రగడ, రాళ్ల దాడి, పోలీసులపై అటాక్

|
Google Oneindia TeluguNews

పవిత్ర రంజాన్ పర్వదినానికి ముందు రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అల్లర్లు చెలరేగాయి. అదీ కాస్త ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేసే వరకు వెళ్లింది. ఇవాళ ఉదయం ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో జలొరీ గేట్ పరిధిలో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జలొరి గేట్‌ పరిధిలో గల బల్‌ముకుంద్ బిస్సా సర్కిల్‌లో గొడవ జరిగింది.

స్వాతంత్య్ర సమరయోధుడు విగ్రహాం వద్ద జెండా ఎగరవేసే విషయంలో గొడవ జరిగింది. తర్వాత రాళ్లు రువ్వడంతో చాలా మంది గాయపడ్డారు. గొడవ మరింత పెద్దది అవుతుందనే ఉద్దేశంతో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో రాళ్లు రువ్వారని వారాసంస్థలు రిపోర్ట్ చేసింది. అయితే అక్కడ హిందువులకు సంబంధించిన జెండా తీసివేసి.. ముస్లింలు జెండా పెట్టడంతో గొడవ జరిగింది. అక్కడ బ్యానర్ ఏర్పాటు చేసి.. లౌడ్ స్పీకర్ కూడా పెట్టారు.

Stones pelted, bikes set ablaze in Jodhpur over loudspeakers on Eid

బాల్ ముకుంద్ బిస్సా విగ్రహాం వద్ద జెండా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. జలొరి వద్ద ఈద్ జెండా పెట్టారు. అయితే మరొ మతానికి చెందినవారు నినాదాలు చేశారు. అక్కడ జెండా, బ్యానర్ తీసివేయడంతో గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య ఫైట్ జరిగింది. పరశురాం జెండా స్థానంలో ఈద్ జెండా పాతారని.. దీంతో గొడవ జరిగిందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) హవా సింగ్ గుమరియా తెలిపారు. ఘటనలో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

ఈద్‌ ప్రార్థనల సమయంలో జోధ్‌పుర్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. జలోరీ గేట్‌ వద్ద జెండాలను ఏర్పాటు చేసే సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు.

జోద్ పూర్ జిల్లాలోని 10 పోలీసు స్టేషన్ పరిధిలో సదర్‌కోత్వాలి, ఉదయమందిర్, సదర్‌బజార్ నగోరి గేట్, ఖండఫల్సా, ప్రతాప్‌నగర్, సుర్‌సాగర్, సర్దార్‌పురా పోలీస్ స్టేషన్, ప్రతాప్‌నగర్ సదర్ దేవ్‌నగర్ పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఘటనపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. జోధ్‌పూర్‌లో కొందరు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాలని గెహ్లాట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

English summary
stones were thrown at the police in the Rajasthan's Jodhpur Jalori Gate area of the city this morning. To maintain control of the scene, the police resorted to lathi-charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X