తండ్రి మృతదేహం ఎదుటే కుమారుడి పెళ్లి.. ఎందుకంటే ?

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు ఆశ పడ్డాడు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల్లో ఒప్పించి వివాహానికి అంగీకారం పొందాడు. కానీ ఈలోపు అతనికి ఊహించని షాక్ తగిలింది. వీధి ఆడిన ఆ వింత నాటకంలో బాధను దిగమింగుకొని కూడా ఎవరూ చేయని ఓ పని చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది..? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

తండ్రి మృతదేహం ఎదుటే కుమారుడు పెళ్లి చేసుకున్న హృదయవిదారక సంఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. విరుధాచలం సమీపంలోని కావణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ అనే మాజీ రైల్వే ఉద్యోగికి ఇద్దరు కుమారులు. ఆయన రెండో కుమారుడు అప్పు. అతడు న్యాయ విద్యను అభ్యసిస్తున్నాడు. అప్పు కొంతకాలంగా విజయశాంతి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే
ఇద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

story-behind-sons-wedding-in-front-of-fathers-dead-body

అయితే ఈలోగా అనుకోని విషాదం చోటుచేసుకుంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. తండ్రి చివరి చూపు తన పెళ్లిపై ఉండాలని, ఆయన ఆశీస్సులతో జీవితాన్ని ప్రారంభించాలని భావించిన అప్పు.. తండ్రి మృతదేహం ఎదుటే తన ప్రేయసిని వివాహమాడాలని అనుకున్నాడు. కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వారి అంగీకారంతో తన తండ్రి పార్ధివ దేహం ఎదుటే అమ్మాయి మెడలో తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు.

తండ్రి కోల్పోయిన క్షణంలోనూ, ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పెళ్లిని తండ్రికి అంకితంగా మార్చుకున్నప్పు చర్యకు చాలామంది సహానుభూతితో స్పందించారు. కుటుంబ బంధాలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మనస్సులోతుల్లో తాకేలా చేసింది.

పుట్టెడు విషాదంలోనూ అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు కొత్త జంటను ఆశీర్వాదించారు. అయితే అమ్మాయి తరఫు వారు ఈ వివాహానికి హాజరు కాలేదని సమాచారం. త్వరలోనే రెండు కుటుంబాలు, బంధువులు సమక్షంలో రిసెప్షన్ నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+