Acid attack: అమ్మాయి మీద యాసిడ్ పోసిన శాడిస్టులు, చెల్లితో కలసి వెలుతుంటే ?, సీసీటీవీల్లో !
న్యూఢిల్లీ: అక్కా, చెల్లెలు ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. ఇంటి నుంచి ఒకేసారి బయలుదేరి వెలుతున్న అక్కాచెల్లి మెట్రోలో ప్రయాణించి స్కూల్ కు వెలుతున్నారు. ఎప్పటిలాగే ఉదయం ఇంటి నుంచి ఇద్దరు అమ్మాయిలు బయలుదేరారు. మార్గం మద్యలో బైక్ లో వెళ్లిన ఇద్దరు యువకులు అక్క ముఖం మీద యాసిడ్ పోశారు. యువతి ముఖం మీద యాసిడ్ పడిందా లేదా అని నిర్దారించుకున్న శాడిస్టులు అక్కడి నుంచి బైక్ లో పరారైనారు. యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంటున్నారు. కూరగాయలు అమ్మినట్లు మార్కెట్ లో యాసిడ్ విక్రయిస్తున్నారని మహిళ కమీషన్ చైర్మన్ మండిపడుతున్నారు.

అక్కాచెల్లెలు
దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నైరుతి ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయి, 13 ఏళ్ల వయసు ఉన్న అక్కాచెల్లెలు నివాసం ఉంటున్నారు. ఢిల్లీలోని ఓ స్కూల్ లో అక్కాచెల్లి చదువుకుంటున్నారు. ఇంటి నుంచి ఒకేసారి బయలుదేరి వెలుతున్న అక్కాచెల్లి మెట్రోలో ప్రయాణించి స్కూల్ కు వెలుతున్నారు.

బైక్ లో వెళ్లి యాసిడ్ పోసి ఎస్కేప్
ఎప్పటిలాగే ఉదయం ఇంటి నుంచి ఇద్దరు అమ్మాయిలు బయలుదేరారు. మార్గం మద్యలో బైక్ లో వెళ్లిన ఇద్దరు యువకులు అక్క ముఖం మీద యాసిడ్ పోశారు. యువతి ముఖం మీద యాసిడ్ పడిందా లేదా అని నిర్దారించుకున్న శాడిస్టులు అక్కడి నుంచి బైక్ లో పరారైనారు. తీవ్రగాయాలైన 17 ఏళ్ల అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు.
ఏం జరిగిందో మా కూతురు చెప్పలేదు
యాసిడ్ దాడికి గురైన 17 ఏళ్ల అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంటున్నారు. యువతి ముఖం మీద యాసిడ్ పోయ్యడంతో యాసిడ్ ఆమె కళ్లలోకి వెళ్లిందని వైద్యులు అంటున్నారు. తనను యువకులు వేదిస్తున్నారని ఇంతకాలం మా కూతురు చెప్పలేదని బాధితురాలి తల్లిదండ్రులు అంటున్నారు.

కిరాతకుడు అరెస్టు
యువతి మీద యాసిడ్ దాడి చేసిన వారిని బాధితురాలు గుర్తుపట్టింది. ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారి ఎం హర్షవర్దన్ బుదవారం మీడియాకు చెప్పారు. ఢిల్లీలో మహిళల మీద అఘాయత్యాలు ఎక్కువ అవుతున్నాయని ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మలివాల్ విచారం వ్యక్తం చేశారు. కూరగాయలు అమ్మినట్లు మార్కెట్ లో యాసిడ్ విక్రయిస్తున్నారని, వాటిని నిషేధించాలని మనవి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఢిల్లీ మహిళ కమీషన్ చైర్మన్ స్వామి మలివాలె ట్విట్ చేశారు.












Click it and Unblock the Notifications