బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Student: ఏఎస్ఐ కొడుకు ఆత్మహత్య, కాలేజ్ లో గొడవ జరిగిందని ఫ్రెండ్స్ ?, పోలీసు అధికారి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాలేజ్ కు క్రమం తప్పకుండా వెలుతున్న యువకుడు చదవులో మొదటి వరుసలో ఉంటున్నాడు. ఎక్కువ మంది స్నేహితులు లేని ఆ యువకుడు కాలేజ్ లో చదువుకోవడం, కొంతసేపు స్నేహితులతో మాట్లాడి ఇంటికి వెళ్లిపోతున్నాడు. కాలేజ్ లో ఆ అబ్బాయి బాగా చదువుతాడని మంచి పేరు ఉంది. ఇంటిలో అందరితో కలిసి టిఫిన్ చేసిన కాలేజ్ అబ్బాయి మద్యాహ్నం అతని తమ్ముడికి గూగుల్ పేలో డబ్బులు పంపించాడు. ఇంట్లోనే ఉంటున్న తన అన్న ఎందుకు నాకు డబ్బులు పంపించాడు అని తమ్ముడు కొంత సేపటి తరువాత అన్న రూమ్ లోకి వెళ్లాడు. రూమ్ లోపల లాక్ చేసి ఉండటంతో తలుపులు పగలగొట్టి చూసే సరికి కాలేజ్ అబ్బాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ లో స్నేహితులతో చిన్న గొడవ జరిగిందని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు ఫ్రెండ్స్ అంటున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ అబ్బాయి తండ్రి ఏఎస్ఐ. తండ్రి పోలీసు అధికారి అని, గొడవ జరిగితే పోలీసు శాఖలో ఉన్న తండ్రి సమస్య పరిష్కరిస్తాడని, గొడవలకు భయపడి అతను ఆత్మహత్య చేసుకుని ఉండడని కొందరు ఫ్రెండ్స్ అంటున్నారు.

Illegal affair: భర్తకు కోట్లలో ఆస్తులు, భార్యకు ఓ ప్రియుడు, భర్త మర్మాంగం నలిపేసి భార్య డ్రామాలు, క్లైమాక్స్ !Illegal affair: భర్తకు కోట్లలో ఆస్తులు, భార్యకు ఓ ప్రియుడు, భర్త మర్మాంగం నలిపేసి భార్య డ్రామాలు, క్లైమాక్స్ !

 డిగ్రీ చదువుతున్న ఏఎస్ఐ కొడుకు

డిగ్రీ చదువుతున్న ఏఎస్ఐ కొడుకు

బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్ లో నాగరాజ్ ఏఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో నాగరాజ్ ఆయన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఏఎస్ఐ నాగరాజ్ పెద్ద కొడుకు ప్రశాంత్ బెంగళూరులోని జయనగర 4వ బ్లాక్ లో ఉన్న బీహెచ్ఎస్ కాలేజ్ లో బీకామ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

 తక్కువ మంది స్నేహితులు

తక్కువ మంది స్నేహితులు

కాలేజ్ కు క్రమం తప్పకుండా వెలుతున్న ప్రశాంత్ చదవులో ముందు ఉంటున్నాడు. ఎక్కువ మంది స్నేహితులు లేని ప్రశాంత్ ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి చదువుకోవడం, కొంతసేపు స్నేహితులతో మాట్లాడి ఇంటికి వెళ్లిపోతున్నాడు. కాలేజ్ లో ప్రశాంత్ బాగా చదువుతాడని మంచి పేరు ఉంది. బీకామ్ పూర్తి అయిన తరువాత ఉన్నత చదువులు చదవాలని ప్రశాంత్ అనుకున్నాడు.

 గూగుల్ పేతో అనుమానం

గూగుల్ పేతో అనుమానం

ఇంటిలో అందరితో ఏఎస్ఐ నాగరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయాడు. ప్రశాంత్ మద్యాహ్నం అతని తమ్ముడికి రూ. 4 వేలు గూగుల్ పేలో డబ్బులు పంపించాడు. ఇంట్లోనే ఉంటున్న తన అన్న ప్రశాంత్ ఎందుకు నాకు డబ్బులు పంపించాడు అని తమ్ముడు అనుకున్నాడు.

 ఆత్మహత్య చేసుకున్న ఏఎస్ఐ కొడుకు

ఆత్మహత్య చేసుకున్న ఏఎస్ఐ కొడుకు

కొంత సేపటి తరువాత అన్నకు ఫోన్ చేశాడు. ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులకు డౌట్ వచ్చి ప్రశాంత్ రూమ్ దగ్గరకు వెళ్లారు. రూమ్ లోపల లాక్ చేసి ఉండటంతో తలుపులు పగలగొట్టి చూసే సరికి ప్రశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

 అనుమానాలు

అనుమానాలు

అనేక

కాలేజ్ లో స్నేహితులతో ప్రశాంత్ కు చిన్న గొడవ జరిగిందని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు ఫ్రెండ్స్ అంటున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ అబ్బాయి ప్రశాంత్ తండ్రి నాగరాజ్ ఏఎస్ఐ. తండ్రి నాగరాజ్ పోలీసు అధికారి అని, గొడవ జరిగితే పోలీసు శాఖలో ఉన్న తండ్రి సమస్య పరిష్కరిస్తాడని, గొడవలకు భయపడి అతను ఆత్మహత్య చేసుకుని ఉండడని కొందరు ఫ్రెండ్స్ అంటున్నారు. మొత్తం మీద ఏఎస్ఐ కొడుకు ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవడం పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

English summary
Student: ASI son commits suicide by hanging himself in house in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X