టీచర్ విసిరిన పెన్ను బాలుడి కంట్లో గుచ్చుకుంది
రాయ్‌గఢ్: ఓ బాలుడు తోటి విద్యార్థితో మాట్లాడినందుకు ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు బాలుడిపై పెన్ను విసిరింది. అది కాస్తా కంటికి తగలడంతో ఆ బాలుడు చూపు కోల్పోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులో పాఠశాలపై దాడికి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌కి చెందిన చేతన్ అనే బాలుడు గ్వాలియర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శనివారం చేతన్ తరగతి గదిలో తన తోటి విద్యార్థితో మాట్లాడుతుండగా నీతూ సింగ్ అనే ఉపాధ్యాయురాలు కోపంతో చేతిలోని పెన్నును బాలుడిపైకి విసిరింది.

కాగా, ఆ పెన్ను కాస్తా బాలుడి కంటికి తగలడంతో తీవ్రగాయమైంది. బాలుడు ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయం తీవ్రంగా ఉండటం, ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల బాలుడి కుడి కంటి చూపు పోయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం కంటికి ఎలాంటి వైద్యం చేయలేమని పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలి కారణంగానే తమ కుమారుడు చూపు కోల్పోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు, టీచర్‌ను ప్రశ్నించిన పోలీసులు.. టీచర్‌ను నిందితురాలి తేల్చారు. కాగా, పాఠశాల యాజమాన్యం మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications