బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Student: మొబైల్ ఫోన్ కు అంకితం అయిన విద్యార్థి, తల్లి మందలించిందని స్టోర్ రూమ్ లోకి వెళ్లి ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు చెప్పడం మొదలైయ్యింది. కరోనా వైరస్ దాదాపుగా కనుమరుగు అయిపోయింది. లాక్ డౌన్ అనే మాట ఇప్పుడు వినపడటం లేదు. ఆన్ లైన్ పాఠాలతో మొబైల్ ఫోన్ లకు బానిసలు అయిన విద్యార్థులు మాత్రం ఆ మొబైల్ ఫోన్ పిచ్చి నుంచి బయటపడటం లేదు. కుటుంబ సభ్యులు మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే కోపంతో స్కూల్ లో చదువుతున్న అబ్బాయి ఆవేశంతో ఊగిపోవడంతో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆన్ లైన్ క్లాసులకు అలవాటుపడిన విద్యార్థులు ఇప్పుడు స్కూల్ కు వెలుతున్నా మొబైల్ ఫోన్ వాడటం మాత్రం మానుకోలేదు.

Wife: అర్దరాత్రి భర్తకు రెండోసారి నో చెప్పిన భార్య, కానేకావాలని భర్త డిమాండ్, కట్ చేస్తే శివార్లలో శవం !Wife: అర్దరాత్రి భర్తకు రెండోసారి నో చెప్పిన భార్య, కానేకావాలని భర్త డిమాండ్, కట్ చేస్తే శివార్లలో శవం !

మొబైల్ ఫోన్ మాయలో విద్యార్థులు

మొబైల్ ఫోన్ మాయలో విద్యార్థులు

లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ పాఠాలకు మొబైల్ ఫోన్లకు అలవాటుపడిన విద్యార్థులు ఇప్పుడు కూడా అదే మొబైల్ ఫోన్లకు బానిసలు అయ్యారు. ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్న విద్యార్థులు ఇంటికి వెళ్లిన వెంటనే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని గేమ్స్ ఆడటం, మొబైల్ లో యూట్యూబ్ వీడియోలు చూడటం సర్వసాధారణం అయిపోయింది.

7వ తరగతి అబ్బాయి

7వ తరగతి అబ్బాయి

బెంగళూరు నగర శివారల్లోని హోసూరు మెయిన్ రోడ్డులోని అత్తిబెలెలో యశష్ గౌడ (13) అనే బాలుడు నివాసం ఉంటున్నాడు. అత్తిబెలెలోని ప్రముఖ స్కూల్ లో యశష్ గౌడ 7వ తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో, లాక్ డౌన్ సమయంలో యశష్ గౌడ ఆన్ లైన పాఠాల కోసం మొబైల్ ఫోన్ కు అలవాటుపడ్డాడు.

ఇంటికి వెళ్లిన వెంటనే ?

ఇంటికి వెళ్లిన వెంటనే ?

ఇప్పుడు కూడా ఎక్కువగా యశష్ గౌడ మొబైల్ ఫోన్ లో ఎక్కువగా కాలం గడుపుతున్నాడు. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటకి వెళ్లిన యశష్ గౌడ మొబైల్ ఫోన్ ఎత్తుకుని ఆడుకుంటున్నాడు. ఆ సందర్బంలో కుటుంబ సభ్యులు మొబైల్ ఫోన్ లాక్కొని నువ్వు బుద్దిగా చదువుకోవాలని యశష్ గౌడకు సూచించారు.

స్టోర్ రూమ్ లో ఆత్మహత్య

స్టోర్ రూమ్ లో ఆత్మహత్య

చాలాసేపు మొబైల్ ఫోన్ ఇవ్వాలని యశష్ గౌడ అతని తల్లిని చెప్పాడని తెలిసింది. అయితే యశష్ గౌడకు అతని తల్లి మొబైల్ ఫోన్ ఇవ్వలేదు. మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే కోపంతో యశష్ గౌడ ఇంటిలోని స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యశష్ గౌడ బయట ఆడుకోవడానికి వెళ్లాడని అతని తల్లి కొంతసేపు పట్టించుకోలేదు.

హడలిపోయిన కుటుంబ సభ్యులు

హడలిపోయిన కుటుంబ సభ్యులు

రాత్రి అయినా యశష్ గౌడ కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వెతికారు. అనుమానం వచ్చి ఇంటిలోని స్టోర్ రూమ్ లో పరిశీలించగా యశష్ గౌడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదని కోపంతోనే యశష్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

English summary
Student: Parents told to leave his mobile phone school boy committed suicide near Bengaluru city in karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X