గొంతు కోశారు: రక్తమోడుతున్న విద్యార్థినిపై రేప్

బెంగళూరు: కంప్యూటర్ క్లాస్ నుండి ఇంటికి వెళుతున్న డిగ్రీ విద్యార్థిని ఎత్తుకెళ్లి అతి దారుణంగా గొంతు కోసి అత్యాచారం చేసి హత్య చేసిన వికృత కామాంధుడిని కర్ణాటకలోని తుమకూరు జిల్లా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

తుమకూరు జిల్లా గుళిగేనహళ్ళి నివాసి రంగరాజు అనే కామాంధుడిని అరెస్టు చేశామని కేంద్ర విభాగం ఐజీపీ అరుణ్ చక్రవర్తి చెప్పారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్తీక్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తుమకూరు జిల్లాలోని జవనహళ్ళిలో రత్నమ్మ (20) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె ఇంటర్ లో 80 శాతం మార్కులు సాధించింది. ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని రివ్యాల్యూషన్ కు అర్జీ సమర్పించింది. తుమకూరులోని కాలేజ్ లో ఈమె డిగ్రీలో చేరింది.

Student rape and murder case near tumkur in karnataka

కాలేజ్ ప్రారంభం కాకపోవడంతో కంప్యూటర్ క్లాస్ కు వెళుతున్నది. జూన్ 25వ తేదిన కంప్యూటర్ క్లాస్ కు వెళ్లిన రత్నమ్మ మధ్యాహ్నం మారుతి కృప అనే బస్సులో ఇంటికి బయలుదేరింది. చాలా రోజుల నుండి రంగరాజు రత్నమ్మ ఎప్పుడు ఇంటికి వెళుతుందనే విషయాన్ని గమనిస్తున్నాడు.

అదే రోజు ఉదయం ఆవులను తీసుకు వెళ్లి పొలంలో కట్టి వేసిన రంగరాజు సమీపంలో మూగోడుహళ్ళి బ్రడ్జి కింద మకాం వేశాడు. గుళిగేనహళ్ళి గేట్ లో బస్సు దిగిన రత్నమ్మ ఇంటికి నడుచుకుంటు వెళుతున్నది. బ్రడ్జి సమీపంలోకి వచ్చిన వెంటనే రంగరాజు రత్నమ్మను ఎత్తుకుని సమీపంలోని పొదలలోకి వెళ్లాడు.

కేకలు వేస్తున్న రత్నమ్మ మీద దాడి చేసి ఆమె వేలును నోటిలో కుక్కేశాడు. తరువాత రత్నమ్మ ప్రతిఘటించడంతో వెంట తీసుకు వెళ్లిన బ్లేడ్ తో ఆమె గొంతు కోసేశాడు. కిందపడిపోయిన రత్నమ్మను నగ్నంగా తయారు చేశాడు. రక్తపు మడుగులో జీవచ్చవంలా పడి ఉన్న రత్నమ్మ మీద అనేక సార్లు రేప్ చేశాడు.

చివరికి ఆమెను చంపేసి ఇంటికి వెళ్లాడు. చేతికి రక్తపు మరకలు ఉండటంతో అతని తండ్రి ఏమి జరిగిందని అడిగాడు. తాను అమ్మాయిని రేప్ చేసి చంపేశానని ధైర్యంగా చెప్పాడు. ఈ విషయం చెప్పరాదని రంగరాజును బయపెట్టి అతనిని ఇంటిలో పెట్టి తాళం వేశాడు.

రత్నమ్మ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించారు. రత్నమ్మ బస్సు దిగి ఇంటికి బయలుదేరిందని ఒకరు చెప్పడంతో గ్రామస్తులు చుట్టు పక్కల గాలించారు. నగ్నంగా శవమై కనిపించిన రత్నమ్మను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు అప్పట్లో సంచలనం కలిగించింది. డీజీపీ ఓం ప్రకాష్ 30 మందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హంతకుడి కోసం గాలించారు. 400 మందిని విచారించారు. ఆ రోజు రంగరాజు బ్రిడ్జి కింద కూర్చుని ఉన్న విషయం తెలుసుకుని అరెస్టు చేశారు. రంగరాజును అరెస్టు చేసిన పోలీసులకు రూ. 2.50 లక్షలు బహుమానంగా అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+