చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనసున్న దొంగ: 4.5లక్షలు తిరిగిచ్చేసి దొరికాడు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తల్లి వైద్యం కోసం దొంగతనం చేసి, తల్లి మృతి చెందడంతో దొంగతనం చేసిన డబ్బు తిరిగిచ్చేసి కటకటాలపాలయ్యాడో మనసున్న దొంగ. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వివరాలిలా ఉన్నాయి.

ఆగస్టు 24న చెన్నైలోని పుదుక్కొట్టై పెరియార్ నగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వాధికారి రాజమాణిక్యం (75) బ్యాంకు నుంచి రూ. 5లక్షలు డ్రా చేసి, భార్య కాత్యాయనికి ఇచ్చి బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో అటుగా వచ్చిన మన్సూర్, మంచినీళ్లు కావాలని కాత్యాయనిని అడిగాడు.

మంచినీళ్లు తెచ్చి ఇచ్చేందుకు ఆమె వంటగదిలోకి వెళ్లగానే, అక్కడే వున్న డబ్బుల బ్యాగు తీసుకుని మన్సూర్ ఉడాయించాడు. లబోదిబోమంటూనే ఆమె తన భర్త రాజమాణిక్యంకు ఫోన్ చేసి విషయం వివరించింది. దీంతో దంపతులిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Student returns stolen money as mom dies

కాగా, ఈ క్రమంలో 26న రాజమాణిక్యం ఇంటికి చేరుకున్న మన్సూర్, తన తల్లికి అనారోగ్యం కారణంగా, వైద్యం చేయించుకునే స్తోమతలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

అయినప్పటికీ తన తల్లి బ్రతకలేదని, వైద్యానికి 50 వేల రూపాయలు ఖర్చయ్యాయని, ఖర్చైన డబ్బుకు ప్రతిగా తన ద్విచక్రవాహనం ఉంచుకోవాలని ఆ దంపతులకు చెప్పి, 4.5 లక్షల రూపాయలున్న బ్యాగు అక్కడ వదిలేసి పరుగుపెట్టాడు.

దీంతో వారు చుట్టుపక్కలవారి సహాయంతో మన్సూర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారిస్తున్నారు. విరాలీమలైకి చెందిన మన్సూర్ (20) తిరుచ్చిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు.

English summary
A polytechnic student, who stole Rs 5 lakh from an aged couple, for the treatment of his ailing mother, returned Rs 4.5 lakh plus his motorcycle after his mother died at Periyar Nagar in this town today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X