Student: కాలేజ్ అమ్మాయిని రైలు కిందతోసి చంపేసిన లవర్, షాక్ తో తండ్రి ఆత్మహత్య !

చెన్నై: కాలేజ్ కు వెలుతున్న అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు. కొంతకాలం క్రితం వరకు ఆ అమ్మాయి కూడా ఆ యువకుడిని ప్రేమించిందని తెలిసింది. అయితే ప్రియుడు చెడుఅలవాట్లకులోనై యువతితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. గంజాయికి బానిస అయిన ప్రియుడు ప్రియురాలి మీద అనుమానం పెంచుకుని ఆమెను టార్చర్ పెట్టాడు. ప్రియుడి హింస తట్టుకోలేక అతన్ని ప్రియురాలు దూరం పెట్టింది. ప్రియురాలిని లొంగదీసుకోవాలని ఆమె ప్రియుడు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. కాలేజ్ కు వెళ్లడానికి సాటి స్నేహితులతో కలిసి యువతి రైల్వేస్టేన్ కు వెళ్లింది. రైలు కోసం యువతి ఎదురు చూస్తోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన శాడిస్టు ప్రియుడు కాలేజ్ అమ్మాయిని ఒక్కసారిగా రైలుకిందకు తోసేశాడు. రైలు దూసుకోవడంతో అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాలేజ్ అమ్మాయి హత్యకు గురికావడంతో ఆవేదనతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

 బీకాం అమ్మాయి

బీకాం అమ్మాయి

చెన్నైలోని దిండి సమీపంలోని అలందూరులోని పోలీస్ క్వాటర్స్ సమీపంలో సత్యప్రియా అలియాస్ సత్యా (20) అనే యువతి నివాసం ఉంటున్నది. చెన్నైలోని టీ నగర్ లోని జైన్ కాలేజ్ లో సత్యా బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. చక్కగా చదువుకుంటున్న మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతోంది.

 రిటైడ్ ఏఎస్ఐ కొడుకు

రిటైడ్ ఏఎస్ఐ కొడుకు

పోలీసు క్వాటర్స్ సమీపంలో సతీష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సతీష్ తండ్రి దయాళన్ (66) అరుంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా ఉద్యోగం చేసి రిటైడ్ అయ్యారు. మూడు సంవత్సరాల క్రితం సతీష్ కాలేజ్ అమ్మాయి సత్యా వెంటపడ్డాడు. కొంతకాలం తనను ప్రేమించాలని సత్యాను సతీష్ వేధించాడు.

 గంజాయికి బానిస అయిన ప్రియుడు

గంజాయికి బానిస అయిన ప్రియుడు

సతీష్ ప్రతిరోజు వెంటపడటంతో సత్యా కూడా ఆ యువకుడిని ప్రేమించిందని తెలిసింది. కొంతకాలం సతీష్, సత్యా కలిసితిరిగారని తెలిసింది. అయితే ప్రియుడు సతీష్ చెడుఅలవాట్లకులోనై కాలేజ్ అమ్మాయి సత్యాతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని తెలిసింది. సతీష్ గంజాయికి బానిస అయ్యాడు.

 ప్రియురాలు గుడ్ బై చెప్పింది

ప్రియురాలు గుడ్ బై చెప్పింది

గంజాయికి బానిస అయిన సతీష్ అతని ప్రియురాలు సత్యా మీద అనుమానం పెంచుకుని ఆమెను టార్చర్ పెట్టాడు. ప్రియుడు సతీష్ టార్చర్ తట్టుకోలేక సత్యా అతన్ని దూరం పెట్టింది. ప్రియురాలు సత్యాను లొంగదీసుకోవాలని ఆమె ప్రియుడు సతీష్ ఇంతకాలం అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

 సత్యాను రైలు కిందతోసి చంపేసిన శాడిస్టు

సత్యాను రైలు కిందతోసి చంపేసిన శాడిస్టు

కాలేజ్ కు వెళ్లడానికి గురువారం సాటి స్నేహితులతో కలిసి సత్యా చెన్నైలోని పరంగిమలై రైల్వేస్టేన్ కు వెళ్లింది. రైలు కోసం సత్యాతో పాటు ఆమె స్నేహితులు ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన శాడిస్టు ప్రియుడు సతీష్ కాలేజ్ అమ్మాయి సత్యాతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత సత్యాను ఒక్కసారిగా లాక్కొని వెళ్లి రైలుకిందకు తోసేశాడు.

 సైకో సతీష్ అరెస్ట

సైకో సతీష్ అరెస్ట

రైలు దూసుకోవడంతో సత్యా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సత్యా స్నేహితులు, సాటి ప్రయాణికులు కేకలు వెయ్యడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సత్యా చనిపోయింది. సత్యాను హత్య చేసిన సతీష్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు, ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసిన పోలీసులు శుక్రవారం వేకువ జామున సతీష్ ను అరెస్టు చేశారు.

 ఆవేదనతో సత్యా తండ్రి ఆత్మహత్య

ఆవేదనతో సత్యా తండ్రి ఆత్మహత్య

కాలేజ్ అమ్మాయి సత్యా హత్యకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యలు ఆర్తనాదాలు చేశారు. కూతురు సత్యా హత్యకు గురైయ్యిందని ఆవేదనతో ఆమె తండ్రి మాణిక్యం శుక్రవారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రైవర్ అయిన మాణిక్యం కష్టపడి అతని కుమార్తె సత్యాను చదివిస్తున్నాడు. గతంలో సతీష్ కాలేజ్ గేట్ ముందు సత్యాను జట్టుపట్టుకుని చితకబాదేశాడని, ఆ సమయంలో సతీష్ తండ్రి పోలీసు పలుకుబడి ఉపయోగించి రాజీ చేశాడని సత్యా కుటుంబ సభ్యులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+