వర్సిటీలో అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో
చెన్నై: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడువేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్న చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయంలో కామాంధుడు బయటపడ్డాడు. స్నానం చేస్తున్న విద్యార్థినులను వీడియోలు తీశాడు. ఈ సంఘటనలో అధికశాతం మంది బాధితులు తెలుగువారే.
అయితే, నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం కామాక్షి హాస్టల్లో స్నానం చేస్తున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని అక్కడే పని చేస్తున్న ఎలక్ట్రిషియన్ రాజా మొబైల్ ద్వారా వీడియో తీస్తుండడాన్ని తోటి విద్యార్థినులు గుర్తించారు. అతను ఆ మొబైల్‌ను బాత్ రూంలో పెట్టి వీడియో తీశాడు.

అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వార్డెన్‌లు జ్యోతి ప్రభ, వాసుదేవన్‌ల వద్దకు తీసుకెళ్లారు. తాను పది రోజుల నుంచి మాత్రమే ఇలా వీడియో తీస్తున్నాననీ, అంతకు ముందెప్పుడూ ఈ పనికి పాల్పడలేదని రాజా ఒప్పుకున్నాడు. నిందితుడు రాజా వయస్సు 33.
కాగా, తాము పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే సిమ్ కార్డును, సెల్ ఫోన్‌ను తొలగించారని, ఆధారాలు లేకుండా చేశారని విద్యార్థినీలు ఆరోపిస్తున్నారు. పోలీసులు రాజాను అరెస్టు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, సెల్ ఫోన్లో నుండి వీడియోలు తొలగించారని విద్యార్థులు ఆరోపిస్తూ వార్డెన్స్ పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించేందుకు యూనివర్సిటీ అథారిటీలు అందుబాటులో లేవు.












Click it and Unblock the Notifications