10, 12 తరగతి బోర్డు పరీక్షల్లో కీలక మార్పులు: కేంద్రం గ్రీన్ సిగ్నల్?

10th and 12th class board exams: విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. బోర్డు పరీక్షల నిర్వహణ వ్యవస్థను మార్చివేయబోతోంది. విద్యార్థులకు మరింత అనుకూలంగా వాటిని తీర్చిదిద్దబోతోంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి లేకుండా చేయడం, మరింత మెరుగ్గా మార్కులను సాధించుకోవడంలో భాగంగా ఈ విప్లవాత్మక మార్పులకు తెర తీసింది.

ఇందులో భాగంగా- 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు ఇకపై ఒక సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలను రాసే వెసలుబాటును కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. అంటే- ఒక విడత బోర్డు పరీక్షలను రాసిన విద్యార్థులకు అందులో ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోతే.. అవే పరీక్షలను ఇంకోసారి రాసే అవకాశం ఈ కొత్త విధానంలో ఉంటుంది.

Students will have the option to appear for 10th and 12th class board exams twice a year

తొలి విడత లేదా మలి విడతల్లో రాసిన పరీక్షల్లో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. వాటిని అలాగే ఉంచుకుని, తక్కువ మార్కులు వచ్చిన పరీక్షలను రద్దు చేసుకోవచ్చు. రెండోసారి రాసిన పరీక్షలను సప్లిమెంటరీగా పరిగణించరు. రెండు సార్లు పరీక్షలు రాసిన వారిని రెగ్యులర్ స్టూడెంట్‌గానే పరిగణిస్తారు. ఈ విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది.

Students will have the option to appear for 10th and 12th class board exams twice a year

ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2020లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకుని రాబోతోన్నామని అన్నారు.

అలాగే ప్రతి విద్యా సంవత్సరంలో కనీసం 10 రోజుల పాటు నో బ్యాగ్ డే ప్రవేశపెట్టాలని భావిస్తోన్నామని, పుస్తకాలకు బదులుగా కళలు, సాంస్కృతిక రంగం, క్రీడల్లో విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తోన్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా కర్రికులమ్‌ను రూపొందిస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+