మోడల్ & బార్ గర్ల్‌కు ఎస్సై వేధింపు, సహజీవనం..?

బెంగళూరు: ఓ ఎస్సై వేధింపులు భరించలేక ఓ యువతి సొంతూరు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై పైన ఫిర్యాదు చేసింది 28 ఏళ్ల ఓ బార్ గర్ల్.

సదరు ఇరవై నాలుగేళ్ల బార్ గర్ల్ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించడంతో అతను తప్పించుకున్నాడు.

బెంగళూరు కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌లో పని చేసే ఎస్సై ధనుంజయ తనను లైంగికంగా వేధించాడని ఆ బార్ గర్ల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వేధింపులు

వేధింపులు

కబ్బన్ పార్కు ఠాణాకు బదలీపై వెళ్లే ముందు ధనుంజయ ఇందిరా నగర ఠానాలో ట్రాఫిక్ విభాగంలో పని చేసే వాడు. సమీపంలోని బార్‌లో పని చేసే ఆమె.. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో అడ్డగించి లైంగికంగా వేధించేవాడని ఫిర్యాదులో వాపోయింది.

వేధింపులు

వేధింపులు

అతని ఆగడాలను తట్టుకోలేక సొంత ఊరైన ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించింది. ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ధనుంజయను అరెస్టు చేసేందుకు బుధవారం బెంగళూరుకు వచ్చారు.

వేధింపులు

వేధింపులు

ధనుంజయ పరారీలో ఉన్నట్లు గుర్తించి బెంగళూరు అదనపు పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌ను కలుసుకొని ఘటనకు సంబంధించిన సమాచారం వివరించారు.

 వేధింపులు

వేధింపులు

దీంతో స్పందించిన అదనపు పోలీసు కమిషనర్ కమల్ పంత్.. వెంటనే ధనుంజయను అరెస్టు చేయాలని నగర పోలీసులను ఆదేశించారు. కాగా, ఇందులో మరో కోణం కూడా వినిపిస్తోంది. సదరు సబ్ ఇన్స్‌పెక్టర్ తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టి.. ఆమెతో కలిసి గత మార్చిలో నందిహిల్స్‌కు టూర్ కూడా వేశారట.

వేధింపులు

వేధింపులు

ఎస్సై, ఈ యువతి కలిసి గత కొద్ది నెలలుగా సహజీవనం చేస్తున్నారట. వారు ఒకే ఇంట్లో చాలా రోజులుగా ఉంటున్నారట. అయితే, అంతకుముందే తనకు పెళ్లైన విషయాన్ని అతను దాచాడని చెబుతోందట.

వేధింపులు

వేధింపులు

అతనికి పెళ్లైన విషయం తెలిసి.. ఆమె ఢిల్లీకి వెళ్లి అతని పైన ఫిర్యాదు చేసిందట. ఢిల్లీలోని మాల్వియా నగర్ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. మరోవైపు తాను మోడల్‌నని అయితే పరిస్థితుల దృష్ట్యా బార్ గర్ల్‌గా పని చేయాల్సి వస్తుందని అతనితో చెప్పిందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+