జాతీయ గీతంలో మార్పులు చేయండి: మోడీకి స్వామి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి జాతీయ గీతం విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జాతీయ గీతం 'జనగణమన'లో స్వల్ప మార్పులు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది నవంబర్ నెలలో ప్రధాని మోడీకి స్వామి లేఖ రాశారు. కొన్ని పదాలను మార్చాల్సి ఉందని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో పేర్కొన్న పదాలతో ప్రస్తుతం జనగణమనను మార్పు చేయాలని కోరారు.

జాతీయ గీతంలో... నాడు బ్రిటిష్ రాజును కీర్తిస్తూ ఉన్న పదాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. వాటి స్థానంలో సుభాష్ చంద్రబోస్ సంస్కృత పదాలను చేర్చి మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ గీతాన్ని మార్పు చేయాలని స్వామి ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications