ఆ ఎంపీ, ఎమ్మెల్యేల ఆస్తులపై దర్యాప్తు: సుప్రీం ఆదేశం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గణనీయంగా ఆస్తులు సంపాదించిన ఏడుగురు ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేలపై దర్యాప్తు జరపాలని సిబిడీటీని( సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్) సుప్రీంకోర్టు సోమవారం నాడు ఆదేశించింది.

దర్యాప్తు జరపాల్సిన ఏడుగురు ఎంపీలు, వివిద రాష్ట్రాల్లోని 98 మంది ఎమ్మెల్యేల పేర్లను సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో అందించనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఎంపీలు, ఎమ్మెల్యేలు గణనీయంగా ఆస్తులు పెంచుకొన్నట్టు తేలిందని సుప్రీంకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరె్క్ట్ ట్యాక్స్‌ను తెలిపింది.

'Substantial asset increase of 7 MPs, 98 MLAs being investigated,' says I-T Department to SC

లక్నోలోని ప్రముఖ ఎన్‌జిఓ సంస్థ 'లోక్ ప్రహరి' ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రజా ప్రతినిధులు ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చిన అంశాలను సుప్రీంకు నివేదిస్తూ ఈ ఆస్తులపై విచారణ జరపాలని కోరింది.

లోక్‌ప్రహరీ సంస్థ సుప్రీంకు 26 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 257 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను సుప్రీంకు అందించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seven Lok Sabha Parliamentarians and 98 state lawmakers are being investigated for "substantial increases" in their assets, the Central Board of Direct Taxes (CBDT) told the Supreme Court (SC) on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X