Viral Video: తన ఊపిరినే బిడ్డకు శ్వాసగా మార్చిన వైద్యురాలు.. 7 నిమిషాల తర్వాత అద్భుతమే జరిగింది..
వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఈ మాటను నిజం చేసింది ఓ వైద్యురాలు. తన ఊపిరినే బిడ్డ ఊపిరిగా మార్చి పసి పాప ప్రాణ దీపాన్ని వెలిగించింది. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పిల్లల వైద్యురాలు అప్పుడే పుట్టిన బిడ్డకు తన నోటితో శ్వాసను అందిస్తోంది. ఇలా శ్వాస అందించడం వల్ల ఆ పాప బతికింది.

7 నిమిషాల పాటు
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలోని CHCకి ఓ మహిళ ప్రసవానికి వచ్చింది. ఆమె పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డలో చలనం లేదు. దీంతో పాపకు ఆక్సిజన్ సపోర్ట్ చేసినా ఫలితం లంభించలేదు. అందరు ఆశాలు వదులుకున్నారు. కానీ అక్కడున్న పీడియాట్రిషియన్ డాక్టర్ సులేఖా చౌదరి తన ప్రయత్నాన్ని ఆపలేదు. బిడ్డ బతికించాలన్న కృతనిశ్చయంతో దాదాపు 7 నిమిషాల పాటు 'మౌత్ టూ మౌత్ రెస్పిరేషన్' అందించడంతో చిన్నారి ఊపిరి పీల్చుకుంది.

డాక్టర్ సులేఖా చౌదరి
శిశువు బతకడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. పీడియాట్రిషియన్ డాక్టర్ సులేఖా చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. మీరు దేవత అంటూ కిర్తీంచారు. సచిన కౌశిక్ అనే పోలీసు అధికారి ట్వట్టర్ ఓ ఈ ఘటనకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. పోస్ట్ తో పాటు "డాక్టర్ సులేఖా చౌదరి, పీడియాట్రిషియన్, CHC, ఆగ్రా. ఆడపిల్ల పుట్టింది కానీ శరీరంలో చలనం లేదు. ముందుగా బాలికకు ఆక్సిజన్ సపోర్టు అందించినా ఫలితం లేకపోవటంతో దాదాపు 7 నిమిషాల పాటు 'మౌత్ టూ మౌత్ రెస్పిరేషన్' అందించడంతో చిన్నారి ఊపిరి పీల్చుకుంది" అని రాసుకొచ్చారు.
3 లక్షలకు పైగా వ్యూస్
ఈ వీడియోను బుధవారం రాత్రి పోస్టు చేయగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది రీట్వీట్లు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. డాక్టర్ సులేఖా చౌదరికి ఫ్యాన్స్ అయిపోయారు. తన ఊపిరిని బిడ్డ ఊపిరిగా మార్చిన సులేఖ గ్రేట్ అంటూ కామెంట్.. ఈమెనే నిజమైన వైద్యురాలంటూ ప్రశంసించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications