Longest day అంటే తెలుసా: అదే రోజు నిర్జల ఏకాదశి కూడా: రెండూ కలిసి..

న్యూఢిల్లీ: ఈ ఏడాది గ్రహాలు, వాటి గమనం కొంత ప్రత్యేకతను సంతరించుకున్నట్టే కనిపిస్తోంది. ఎప్పుడూ లేనివిధంగా సంపూర్ణ చంద్రగ్రహణం, తుఫాన్ రెండూ ఒకేరోజు కలిసి మరీ వచ్చాయి. అదొక్కటే అనుకుంటే- సూర్యగ్రహణం కూడా అంతే- ఈ నెల 9వ తేదీన ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం శని జయంతి నాడు సంభవించింది. అదే రోజు జ్యేష్ఠ అమావాస్య కూడా. ఇలా గ్రహాలు, జ్యోతిష్యం రెండూ కలిసి వస్తున్నాయి. అది అక్కడితో ఆగలేదు. మరోసారి కూడా అలాంటి అద్భుతమే చోటు చేసుకుంది.

సమ్మర్ సోల్స్‌టైస్ అంటే..

సమ్మర్ సోల్స్‌టైస్ అంటే..

ఏడాదిలో సుదీర్ఘరోజుగా జూన్ 21వ తేదీ (సోమవారం)ని భావిస్తుంటారు. ఆ రోజు సూర్యుడు చాలా ఆలస్యంగా అస్తమిస్తాడు. రోజువారీ సాధారణ సమయం కంటే 17 నిమిషాలు ఆలస్యంగా సూర్యాస్తమయం చోటు చేసుకుంటుందని టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఉత్తర ధృవం సూర్యడి వైపు 23.4 డిగ్రీల కోణంలో వచ్చినప్పుడు సుదీర్ఘమైన రోజు ఏర్పడుతుంది. ఈ సందర్భంలో సూర్య కిరణాలు నేరుగా వృశ్చిక రాశి మీద 23.27 డిగ్రీల కోణంలో ప్రసరిస్తాయి. ఫలితంగా సూర్యాస్తమయం సాధారణంగా కంటే కొంత ఆలస్యంగా కనిపిస్తుంది. ఆసియాలో జూన్ 21వ తేదీన ఇది సంభవిస్తుంటుంది. దేశాలు, ఖండాల వారీగా ఈ తేదీలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి.

 సోల్స్‌టైస్ అర్థమేంటీ?

సోల్స్‌టైస్ అర్థమేంటీ?

సోల్స్‌టైస్ (Solstice) అనేది లాటిన్ పదం. లాటిన్‌లో సోల్ అంటే సూర్యుడు, సెస్టయిర్ అంటే స్థిరంగా నిలిచి ఉండటం అని అర్థం. ఈ రెండి నుంచీ సోల్స్‌టైస్ అనే పదం ఉద్భవించింది. ఏడాదిలో రెండుసార్లు సోల్స్‌టైస్ సంభవిస్తుంది. ఒకటి వేసవిలో సంభవించడాన్ని సమ్మర్ సోల్స్‌టైస్‌గా (Summer Solstice 2021), చలికాలంలో అంటే డిసెంబర్ 21వ తేదీన సంభవించే ఘటనను వింటర్ సోల్స్‌టైస్‌ (Winter Solstice)గా నిర్ధారించారు. డిసెంబర్ 21వ తేదీన సంభవించే వింటర్ సోల్స్‌టైస్ సందర్భంగా సూర్యుడు చాలా త్వరగా అస్తమిస్తాడు.

నిర్జల ఏకాదశి నాడే..

నిర్జల ఏకాదశి నాడే..

ఇదిలావుండగా- అదే రోజు నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi) కూడా సంభవించింది. నిర్జల ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తుంటారు భక్తులు. సోమవారం నాడే ఇది ఏర్పడటం వల్ల ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాంగం ప్రకారం- జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశిగా భావిస్తారు. నిర్జల ఏకాదశి నాడు పలువురు భక్తులు వ్రతాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాదిన దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. గంగా స్నానానికి ప్రాధాన్యత ఇస్తారు.

గంగాస్నానాలతో

గంగాస్నానాలతో

శ్రీమన్నారాయణుడిని పూజిస్తారు. ఆది, సోమవారాల్లో కలిసి వచ్చిందీ సందర్భం. ఆదివారం సాయంత్రం 4:21 నిమిషాలకు ఏకాదశి తిథి ఆరంభమౌతుంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటా 31 నిమిషాల వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే వ్రతాలు చేస్తారు భక్తులు. తిథి ముగింపు రోజు నాడు గంగా స్నానం చేస్తారు. ఆదివారం నాడు గంగా దసరా ఏర్పడటం వల్ల భక్తులు హరిద్వార్‌లో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలను ఆచరించారు. కరోనా వైరస్ ఆంక్షల నడుమ వారి స్నానాలు సాగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+