వేసవిలో తప్పకుండా చూడాల్సిన 10 రీఫ్రెషింగ్ సిటీస్ ఇవే..
సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో స్కూల్స్, కాలేజీలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సమ్మర్ లోనూ చల్లచల్లగా ఉండే ప్రాంతాలు మన భారత్ లో ఉన్నాయని మీకు తెలుసా..? ఆ ప్రాంతాలకు వెళ్తే మళ్లీ తిరిగి రావాలని పించదు..? మరి ఆ ప్రాంతాల వివరాలు తెలుసుకుందామా..?
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్యాటకులు చల్లని వాతావరణం, స్వచ్ఛమైన గాలి కోసం వేసవి విడిదికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. వేసవి విడిదికి షిమ్లా ఫేవరెట్ ప్లేస్ గా ఉంటుంది. పైన్ చెట్లతో నిండిన కొండకోనలు, బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు ఇక్కడ చాలా ప్రత్యేకం. అలాగే మాల్ రోడ్డు వెంట నడుస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని తనివితీరా ఆస్వాదించొచ్చు. ఫ్యామిలీతో వెళ్లాల్సిన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే..
ఇక హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. మనాలి సాహసయాత్ర కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనాలిలో మంచుతో కప్పబడిన శిఖరాలు, నదీ తీరాలు, పారా గ్లైడింగ్, అడ్వెంచర్, రిలాక్సేషన్ కోరుకునేవారికి మనాలి మంచి ఆప్షన్. ఇక్కడి చల్లని గాలులు, మంచు కారణంగా చల్లని వాతావరణం హాయిగా అనిపిస్తుంది. అలాగే ఇదే స్టేట్ లోని మరో ప్రాంతం ధర్మశాల.. ఈ పర్యటక ప్రాంతం టిబెటన్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ప్రదేశం ఆధ్యాత్మికత, ప్రకృతిని ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
అలాగే ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ ప్రాంతం ఓ అందమైన హిల్ స్టేషన్. నైని సరస్సు చుట్టూ ఈ అందమైన హిల్ స్టేషన్ విస్తరించి ఉంటుంది. ఇక్కడ బోటింగ్, ఆహ్లాదకరమైన వాకింగ్, చల్లని వాతావరణం పర్యటకుల మనసును దోచేస్తాయి. సమ్మర్ లో ఈ ప్రాంతాలను వేలాదిగా పర్యటకులు వస్తుంటారు. ముస్సోరీ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు. ఈ పర్యటక ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక తమిళనాడులోని ఊటీ ప్రాంతం గురించి మనకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీకి నిత్యం వందలాది మంది వెళ్తుంటారు. ఇక్కడి తేయాకు తోటలు చాలా ఫేమస్. ఊటీలో నీలగిరి మౌంటెన్ రైల్వే ప్రయాణం ఓ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తోంది.

వీటితోపాటు దక్షిణ భారత్ లో అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. కేరళలోని మున్నార్, కర్ణాటకలోని కూర్గ్, అలాగే తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది పర్యటకులు వస్తుంటారు.












Click it and Unblock the Notifications