జయ ఎఫెక్ట్: పడిపోయిన సన్ టీవీ స్టాక్స్

చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని పాలక అన్నాడియంకె విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో సన్ టీవీ స్టాక్స్ పతనమయ్యాయి. డిఎంకె అన్నాడియంకెపై ఆధిపత్యం సాధించలేని భయం స్టాక్స్‌పై పడింది. తమిళనాడు శానససభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో సన్ టీవీ స్టాక్స్ బిఎస్ఈలో 7 శాతం పడిపోయింది.

పతనం విలువ గురువారం ఉదయం 9.20 గంటలకు రూ.396.95 ఉంది. ఎన్ఎస్‌ఈపై కూడా దాని ప్రభావం కనిపించింది. సన్ స్టాక్ ఎన్ఎస్ఈలో 6.3 శాతం పడిపోయి రూ.401.45 కు చేరుకుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల నేపథ్యంలో సన్ టీవీ స్టాక్‌లో తొలుత పెరుగుదల కనిపించింది.

Sun TV stock falls on fears of DMK losing to AIADMK

అయితే, పావు గంటలోనే సన్ టీవీ స్టాక్ పతనదిశగా సాగడం ప్రారంభమైంది. సన్ టీవీ డిఎంకె అధినేత కరుణానిధి మేనళ్లుల్లు మారన్ సోదరులకు చెందిందనే విషయం తెలిసిందే.

కాగా, సన్ టీవీకి ప్రత్యర్థిగా భావించే రాజ్ టెలివిజన్ నెట్ వర్క్ లిమిటెడ్ స్టాక్ బిఎస్ఈలో ఉదయం 9.20 గంటలకు 17 సాతం పెరిగి రూ. 71,80కు చేరుకుంది. ఈ టీవీ చానెల్‌కు అన్నాడియంకెతో గానీ డిఎంకెతో గానీ సంబంధం లేదు. ఎన్ఎస్ఈలో రాజ్ టీవీ స్టాక్ 18 శాతం పెరిగి రూ.71.60కి చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+