సునంద పుష్కర్ మృతి: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై ఢిల్లీ పోలీసుల ఛార్జీషీట్
Recommended Video

సునంద మృతి కేసులో నిందితుడిగా శశి థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్‌పై న్యూఢిల్లీ పోలీసులు చార్జీషీట్‌ను దాఖలు చేశారు. శశిథరూర్ భార్య సునంద్ పుష్కర్ కేసులో నాలుగేళ్థ తర్వాత పోలీసులు సోమవారం నాడు ఛార్జీషీట్ దాఖలు చేశారు.
పాటియాల మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్ ఎదుట ఈ ఛార్జీషీట్ ను పోలీసులు సమర్పించారు. అయితే సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. ఇది హత్య కాదని చార్జీషీటులో పోలీసులు అభిప్రాయపడ్డారు.

సునంద్ పుష్కర్ ను ఆత్మహత్య చేసుకొనేలా శశిథరూర్ ప్రేరేపించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ళ తర్వాత ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణను మే 24 వ తేదికి కోర్టు వాయిదా వేసింది. నాలుగేళ్ళ క్రితం ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఆ సమయంలో ఈ కేసు సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications