విషంవల్లే సునంద మృతి, థరూర్ రొమాంటిక్ మెసేజ్‌లు!

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ విషం కారణంగానే మృతి చెందినట్లు పోలీసులకు సమర్పించిన తాజా నివేదికలో ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. సునంద పుష్కర్ కడుపులోని పేగుల్లో విష పదార్థం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది.

ఆమె శరీరంలోని అవయవాలకు కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నిర్వహించిన పరీక్షలో కనుగొన్న విషయాల ఆధారంగా శవపరీక్ష చేసిన ముగ్గురు వైద్యుల బృందం తాజాగా నివేదికను రూపొందించింది.

 Sunanda Pushkar death due to poisoning: Medical team

సునంద పుష్కర్ జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఒక స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. సునంద మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరి ఆమె పేగులను పరిశీలించి కనుగొన్న అంశాల ఆధారంగా తాజా నివేదికను తయారు చేశారు.

ఢిల్లీ పోలీసులకు అందజేసింది సునంద కిడ్నీ, కాలేయం, గుండె బాగానే పనిచేస్తూ ఉండడం వల్ల విష ప్రయోగం వల్లనే ఆమె చనిపోయిందని తొలుత వైద్యులు అభిప్రాయానికి వచ్చారు. సునంద పేగులను పరిశీలించి కనుగొన్న అంశాల ఆధారంగా ఇప్పుడు కూడా ఆమె విషపదార్థం వల్లనే చనిపోయిందనే నిర్ధారణకు వచ్చింది.

సునంద ఫ్యామిలి అనుమానం

సునంద పుష్కర్ మృతి ప్రణాళికాబద్ధంగా చేసిందని ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సునంత మృతిలో శశిథరూర్ పాత్ర కూడా ఉండి ఉంటుందని వారు అనుమానిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సునంద మృతిలో థరూర్ పాత్ర పైన పోలీసులు విచారణ చేయనున్నారు. ఆయన ఎంత వరకు కారణమనే అంశంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

సునందకు థరూర్ విడాకులు ఇవ్వాలనుకున్నారా?

సునంద పుష్కర్‌కు శశిథరూర్ విడాకులు ఇవ్వాలనుకున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సునంద మృతికి ముందు ఆమె తన స్నేహితురాలు నళినితో చాలాసేపు మాట్లాడారు. నళిని తన స్టేట్‌మెంట్లో సంచనల విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. శశిథరూర్, పాక్ జర్నలిస్ట్ తరర్ రొమాంటిక్ మెసేజ్‌లు చేసుకున్నారని, అందులో ఓ మెసేజ్ థరూర్ డైవోర్స్ అంశంపై ఉందని, 2014 ఎన్నికల అనంతరం డైవోర్స్ తీసుకొని, తరర్‌ను వివాహం చేసుకోవచ్చుననే విషయం ఉందని నళిని చెప్పినట్లుగా తెలుస్తోంది.

శశిథరూర్ లేకుండా తాను ఉండలేనని తరర్ ఓ సందేశంలో పేర్కొన్నట్లుగా కూడా నళిని చెప్పారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే శశిథరూర్ ఫ్యామిలీ కూడా ఈ అఫైర్‌ను సమ్మతించినట్లుగా సునంద చెప్పిందని నళిని తన స్టేట్‌మెంట్లో చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

సీబీఐ విచారణకు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్

సునంద పుష్కర్ మృతి పైన సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+