మోతాదుకు మించిన డ్రగ్స్ వల్లే సునంద మృతి?
హైదరాబాద్: మోతాదుకు మించిన మత్తుపదార్థాలు తీసుకోవడం వల్లనే కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మరణించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునంద పుష్కర్‌కు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక సోమవారం వస్తుందనే మాట వినిపిస్తోంది. ఆమె ఆల్కహాల్ తీసుకున్న ఛాయలు కనిపించలేదని అఖిల భారత వైద్య విజ్జాన సంస్థ (ఎయిమ్స్) వైద్య నిపుణులు అంటున్నారు.
మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు వాడే అల్ప్రాజోలమ్‌ను మోతాదుకి మించి తీసుకున్నారనే అనుమానాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. దానివల్లనే ఆమె మరణించి ఉండవచ్చునని అంటున్నారు. ఆమె గదిలో అల్ప్రాక్స్‌కు చెందిన ఖాళీ స్ట్రిప్ దర్యాప్తు అధికారులకు లభించింది.

సునంద పుష్కర్‌ది ఆకస్మిక అసహజ మరణమని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఇంతకు ముందు చెప్పారు. పోస్టుమార్టం నివేదికను సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌కు సమర్పిస్తారు. సునంద పుష్కర్ మృతిపై సేకరించిన వాంగ్మూలాలను వాటితో సరిపోలుస్తారు.
52 ఏళ్ల సునంద పుష్కర్ శుక్రవారంనాడు న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని లీలా ప్యాలెస్ హోటల్లో మరణించిన విషయం తెలిసిందే. దర్యాప్తు అధికారులు శశి థరూర్ వాంగ్మూలాన్ని కూడా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నమోదు చేశారు.












Click it and Unblock the Notifications