నేను హిందువును.. అందుకే సీఎం అభ్యర్థిగా నన్ను తిరస్కరించారు : సునీల్ జాఖర్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వ్యవహారం రోజుకోక మలుపు తిరుగుతోంది. ఇది పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పార్టీ సీనియర్ నేత సునీల్ జాఖర్ తో పాటు పలువురు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు.

నేను హిందువును అందుకే పక్కన పెట్టారు..
తాజాగా పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జాఖర్ పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువును అన్న కారణంతోనే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం తనను పక్కకు పెట్టిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం సిక్కు వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం పదవిలో కూర్చోబెట్టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఢిల్లీలో అధిష్టానానికి సలహాలు, సూచనలిచ్చే వారు కూడా కేవలం సిక్కు వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సూచిస్తున్నారని పేర్కొన్నారు.

పంజాబ్ సీఎం అభ్యర్థిగా సిక్కు వ్యక్తే..
పంజాబ్ సీఎం అభ్యర్థిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తే ఉండాలని సూచించడం తనను షాక్‌కు గురి చేసిందని సునీల్ జాఖర్ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అధిష్టానం త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కూర్చున్న సలహాదారులు కాంగ్రెస్ పెద్దలకు సరైన సలహాలు ఇవ్వడం లేదన్నారు. ఇలా అయితే తనను సీఎం చేయడం అనేది పక్కనపెడితే.. కనీసం ఎమ్మెల్యేగా కూడా కాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం కేవలం తాను పంజాబీ హిందువును కావడమే అని ఆయన ఆరోపించారు.

ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్
ఆమ్ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఇటీవల ఆపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలుపు ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అవినీతి లేని పాలన ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమని కేజ్రీవాల్ అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications