నిద్రలేని రాత్రులే..: ముంబైకి వ్యక్తికి చుక్కలు చూపిన సన్నీ డియోల్ ‘ఫోన్ నెంబర్’
న్యూఢిల్లీ: అవును ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత ఈ వార్తకు సరిగ్గా సరిపోతుంది. ముంబైకి చెందిన ప్రశాంత్ మిశ్రా ఎవరో చేసిన పొరపాటుకు శిక్ష అనుభవిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. లోక్‌సభ వెబ్‌సైట్‌లో ఓ ఎంపి ఫోన్ నెంబర్ కు బదులు ఇతడి ఫోన్ నెంబర్ పెట్టడంతో అతను నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిర్విరామంగా ఫోన్ కాల్స్
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ఎంపీ, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఫోన్ నెంబర్‌కు బదులు పొరపాటున ప్రశాంత్ మిశ్రా ఫోన్ నెంబర్‌ను లోక్‌సభ వెబ్‌సైట్‌లో పెట్టారు. దీంతో అతడికి నిర్విరామంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫిర్యాదులు, అభ్యర్థనలే కాకుండా వాట్సప్, టెక్ట్స్ సందేశాలు కూడా వెల్లువెత్తాయి.

గురుదాస్‌పూర్ వాసుల ఆగ్రహం
ఈ క్రమంలో తనకు ఇలా ఎందుకు జరుగుతోందో తెలియక మొదట తల పట్టుకున్నాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ముంబైలో ఉంటున్నారని గురుదాస్‌పూర్ వాసుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో.. ఇది సన్నీ డియోల్ ఫోన్ నెంబర్ అని వారు భావించి ఉన్నట్లున్నారని మిశ్రాకు అర్థమైంది.

అధికారుల పొరపాటుకు..
సన్నీ డియోల్‌ను ఎంపీగా ఎన్నుకుని తప్పు చేశామని పలువురు వ్యాఖ్యానిస్తుండగా.. ఆయనను కలవాలని ఉందని మరికొందరు అభిమానులు సందేశాలు పంపుతున్నారని మిశ్రా తెలిపారు. అధికారులు చేసిన పొరపాటుకు తాను శిక్ష అనుభవిస్తున్నానని మిశ్రా వాపోయారు.

తన ఫోన్ నెంబర్ తొలగించాలంటూ..
గత సంవత్సరమే ఈ ఫోన్ నెంబర్ తీసుకున్నానని, లోక్‌సభ వెబ్ సైట్లో తన నెంబర్ పొరపాటుగా పెట్టడంతోనే రోజుకు వందలు వేలాల్లో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. వెంటనే తన ఫోన్ నెంబర్‌ను లోక్‌సభ వెబ్ సైట్ నుంచి తొలగించాలని అధికారులను వేడుకుంటున్నారు సదరు వ్యక్తి.

నిద్రలేని రాత్రులు..
ఈ క్రమంలో ప్రశాంత్ మిశ్రాకు ఊరట లభించినట్లయింది. లేదంటే ఆ ఫోన్లు, ఫిర్యాదులతో తనకు నిద్రలేకుండా ఉండేదని, ఏ పని చేసుకుందానుకున్న విసుగు తెప్పించేలా ఏండేదని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు తాను ప్రశాంతంగా ఉండవచ్చంటూ సంబరపడిపోతున్నడు. గత కొంత కాలంగా కిందట బీజేపీలో చేరిన సన్నీ డియోల్ 2019 సార్వత్రిక ఎన్నికలల్లో ఆ పార్టీ పోటీ చేసి గెలుపొందారు. ఇది ఇలా ఉండగా, సన్నీ డియోల్ ఫోన్ నెంబర్‌ను లోక్‌సభ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశారని ఆయన వ్యక్తిగత సహాయకుకు నిరంజన్ విద్యాసాగర్ తెలిపారు. పొరపాటున పెట్టిన ప్రశాంత్ నెంబర్‌ను అధికారులు తొలగించారని తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications