
రూ.45 లక్షలు: పీఎస్‌లో ఇచ్చేసిన కానిస్టేబుల్.. అభినందనలు
ఇప్పుడు అంతా కమర్షియల్.. ఫక్తుగా చెప్పాలంటే అంతా డబ్బుమయం.. రూపాయి ఆశించకుండా ఎవరూ ఏమీ చేయడం లేదు. ఎక్కడైనా నగదు, నగలు కనిపిస్తే తీసుకోవడమే.. తిరిగి ఇవ్వడమనే సమస్యే లేదు. ఏదో కొందరు మాత్రమే ఇలా ఇస్తుంటారు. ఇదివరకు మనం చాలా సందర్భాల్లో చుశాం. అవును ఆటో, బస్సులో నగదు పోయినవారికి తిరిగి ఇచ్చేసిన ఘటన.. ఇప్పుడు మరొకరు కూడా అలానే స్పందించారు. ఇదేంటో తెలుసుకుందాం పదండి.

కానిస్టేబుల్ ఇలా..
ఛత్తీస్
గఢ్
రాయ్‌పూర్‌లో
నిలంబర్
సిన్హా
ట్రాఫిక్
కానిస్టేబుల్‌గా
పనిచేస్తున్నాడు.
నయా
రాయ్‌పూర్‌లో
కయాబంధ
పోస్ట్
వద్ద
పనిచేస్తున్నాడు.
అయితే
ఉదయం
ఓ
బ్యాగ్
రోడ్డుపై
కనిపించింది.
అదీ
తీసి
చూడగా..
డబ్బులు
కనిపించాయి.
మొత్తం
రూ.500,
రూ.2
వేల
నోట్లతో
నిండి
ఉంది.
ఆ
మొత్తం
రూ.45
లక్షలు
అవుతుంది.
ఆ
డబ్బు
ఎవరిదో
అని
అనుకుని..
వెంటనే
సమీపంలో
గల
పోలీసు
స్టేషన్‌లో
అప్పగించారు.
ఈ
మేరకు
ఎస్పీ
సుఖానందన్
రాథోడ్
వివరించారు.

అభినందనలు
కానిస్టేబుల్ నిలంబర్ సిన్హాను సీనియర్ అధికారులు అభినందిస్తున్నారు. రివార్డు కూడా ప్రకటించారు. నగదు ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేపట్టారు. పరుల సొమ్ము పాము వంటిదని నిలంబర్ సిన్హా నిరూపించారు. తనకు ఆ డబ్బు వద్దని.. ఏ మాత్రం ఆశించకుండా పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఇంకేముంది అదీ కాస్త వైరల్ అవుతుంది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రూ.45 లక్షలు
ఈ రోజుల్లో వంద, రెండొందలు కనిపిస్తేనే ఇవ్వని పరిస్థితి. మరీ రూ.45 లక్షలు అంటే మాములా.. అయినప్పటికీ అతను పీఎస్‌లో అప్పగించాడు. మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు. అతను చేసిన మంచి పనిని పలువురు అభినందిస్తున్నారు. వావ్ అంటూ కొనియాడుతున్నారు. సిన్హా చేసింది.. ముమ్మాటికీ మంచి పనే.. దానిని అందరూ ప్రశంసించాల్సిందే.