దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

ఆ దొంగది హీరోలను మించిన ట్రాక్ రికార్డ్..! : నటనైనా.. దొంగతనమైనా..

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ : పూటకో వేషం.. రోజుకో కారు.. చదువుకుంది 'లా', కానీ ఎదుటోళ్లను బురిడీ కొట్టించడంలో అతనిది పీహెచ్.డీ ని మించిన పట్టానే. సినిమా హీరోలను మించిన ట్రాక్ రికార్డుతో 77 ఏళ్ల వయసులోను ఇట్టే దొంగతనాలు చేయగల మహా ముదురు ధన్ రామ్ మిట్టల్.

  52ఏళ్ల దొంగ కెరీర్.. 128 ఎఫ్ఐఆర్ లు, 25 సార్లు అరెస్టులు, 500 కారు దొంగతనాలు, జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన ట్రాక్ రికార్డును కొనసాగించాడు. ఇదేదో డబ్బు సంపాదన కోసం అతను ఎంచుకున్న రాంగ్ రూట్ కాదు. జస్ట్ అలవాటును మానుకోలేక 52 ఏళ్లుగా కొనసాగుతోన్న అతని దొంగ కెరీర్.

  ధన్ రామ్ మిట్టల్ వ్యవహారానికి పోలీసులు సైతం నోరెళ్లబెట్టగా.. అలవాటులో భాగంగా బుధవారం నాడు ఓ కారు దొంగతనానికి యత్నిస్తున్న ధన్ రామ్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. అనంతరం విచారణ చేపట్టగా ధన్ రామ్ చెప్పిన విషయాలు విని పోలీసులకే భారీ షాక్ తగిలింది.

  ‘Super thief’ Dhani Ram Mittal, who stole over 1,000 cars, nabbed again

  పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీ శివారులోని నారెల ప్రాంతంలో భార్య, కోడలితో కలిసి ఉంటున్నాడు ధన్ రామ్. తండ్రి దొంగతనాలను భరించలేక అతని ఇద్దరు కుమారులు ఇంటికి దూరంగా ఉంటున్నారు. కాగా, 'లా' చదువుకున్న ధన్ రామ్, 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. అక్కడినుంచే అతడి నటప్రస్థానం మొదలైంది.

  క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉండగా, ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. జడ్జిగా ఎంతోమంది నేరస్తులకు బెయిల్స్ కూడా మంజూరు చేశాడు. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. ఆఖరికి రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు.

  ఇన్ని చేసిన ధన్ రామ్ మొట్టమొదటి సారిగా 1964 లో జైలుకి వెళ్లాడు. ఇక అప్పటినుంచి బయటకు రావడం, లోపలకు వెళ్లడం నిరంతరంగా జరుగుతూనే ఉంది. అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధన్ రామ్, తాజాగా పోలీసులు అరెస్టు చేయడానికి నాలుగు నెలల ముందువరకు కూడా జైలు జీవితమే గడిపి బయటకు వచ్చాడు.

  దొంగతనంలో తెలివిమీరిన ధన్ రామ్ ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అప్పడప్పడు సెకండ్ హ్యాండ్ కార్లను కొనే డీలర్లకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మేస్తాడు. ఒకవేళ దొరికి జైలుకెళ్లినా.. ఏమాత్రం ఢీలా పడేది లేదు. అక్కడి సహచర దొంగలకు కూడా తన దొంగ పాఠాలు బోధిస్తుంటాడు.

  కాగా, 80 ఏళ్లకు దగ్గరపడ్డా..! దొంగతనాలకు ఏమాత్రం వెనుకాడని ఈ దొంగ, బుధవారం నాడు కారు చోరికి యత్నించాడు. అయితే సీసీటీవీ ద్వారా ఇదంతా గమనించిన పోలీసులు నిముషం వ్యవధిలోనే కారు తాళాన్ని తెరిచిన అతని చోర కళను చూసి అవాక్కయ్యారు. మొత్తానికి వలపన్ని పట్టుకోవడంతో ధన్ రామ్ మరో నేరానికి బ్రేక్ పడింది. మరి ఇప్పటికైనా ధన్ రామ్ తన చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో..! లేక కేసు నుంచి బయటపడగానే యథావిధిగా పని కానిచ్చేస్తాడో..!

  English summary
  Less than two months after he was released from jail, 77-year-old Dhani Ram Mittal — known as ‘Super Natwarlal’ and ‘Indian Charles Sobhraj’ in police records — again landed in jail in a vehicle theft case.Mittal, police said, has been involved in over 130 vehicle theft cases over the years.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more