ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు శిక్ష: రూ.2 వేలు జరిమానా

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టి.. దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, లిక్కర్ బరూన్ విజయ్ మాల్యాకు దేశ అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కోర్టు ధిక్కారణ కేసు విషయంలో శిక్ష విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువడించింది. 2017లో చోటు చేసుకున్న ఓ ఘటనలో విజయ్ మాల్యా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు ధృవీకరించింది. ఈ కేసులో శిక్షను ఖరారు చేసింది.

రూ.2,000 ఫైన్

రూ.2,000 ఫైన్

విజయ్ మాల్యాకు నాలుగు నెలల కారాగార శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. అలాగే- 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వడ్డీతో కలిపి ఈ 40 మిలియన్ డాలర్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సూచించింది. నిర్దేశించిన గడువులోగా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫలమైతే- ఆయన ఆస్తులను అటాచ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ దిశగా సంబంధిత దర్యాప్తు ఏజెన్సీకి ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేసింది.

కోర్టు ధిక్కారణగా..

కోర్టు ధిక్కారణగా..

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కాగా- 2017 మే 9వ తేదీన విజయ్ మాల్యా తన పిల్లల అకౌంట్‌కు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేశారు. తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించకుండానే ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

 మార్చి 10న తీర్పు రిజర్వ్

మార్చి 10న తీర్పు రిజర్వ్

విజయ్ మాల్యా కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లు ఇదివరకే పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే తన విచారణనను పూర్తి చేసింది. వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం దీనిపై అప్పటికప్పుడు శిక్షను ఖరారు చేయలేదు. ఈ సంవత్సరం మార్చి 10వ తేదీన తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ధర్మాసనం విజయ్ మాల్యాకు విధించాల్సిన శిక్షను ఖరారు చేసింది. తుది తీర్పును వినిపించింది.

లండన్‌లో..

లండన్‌లో..


బ్యాంకులకు 9,500 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడిన విజయ్ మాల్యా.. ఏడు సంవత్సరాల కిందట దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్‌లో నివసిస్తోన్నారు. ఆయనను భారత్‌కు రప్పించడానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని విచారించడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. పలు ప్రయత్నాలు చేశాయి గానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.

ఆస్తులు జప్తు..

ఆస్తులు జప్తు..

న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతుండటం వల్ల ఆయనను స్వదేశానికి రప్పించలేకపోతోన్నాయి దర్యాప్తు సంస్థలు. ఇప్పటికే ఆయనకు చెందిన పలు ఆస్తులను బ్యాంకులు వేలం వేశాయి. తమకు చెల్లించాల్సిన మొత్తంలో నుంచి కొంతవరకు రాబట్టుకోగలిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించింది. లీడ్ బ్యాంక్‌గా వ్యవహరించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా వంటి పలు నగరాల్లో విజయ్ మాల్యా, ఆయనకు చెందిన సంస్థల పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+