మమతకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. పెగాసస్ కమిషన్ దర్యాప్తుపై స్టే..
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెగాసస్ స్పైవేర్‌పై దర్యాప్తు చేయడాన్ని తప్పుపట్టింది. గతంలో కోర్టుకు ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహారించడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పెగాసస్‌పై దీదీ సర్కార్ వేసిన దర్యాప్తు కమిషన్‌పై స్టే విధించింది.

దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ హ్యాకింగ్ ఉదంతం
పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ ఉదంతం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. గత పార్లమెంటు సమావేశాలను ఈ అంశం కుదిపేసింది. ప్రతిపక్షాలు దీనిపై ఆందోళనకు కూడా దిగాయి. కేంద్రం తీరుపైవిమర్శలు గుప్పించాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన పలువురి ఫోన్లు హ్యాకింగ్ గురైయాయన్న ఆరోపణలు వచ్చాయి. ఫోన్లు హ్యాకింగ్ అయిన వారి జాబితాలో మమతా బెనర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దానిపై విచారణ చేపట్టాలని దీదీ సర్కారు నిర్ణయించింది. ముగ్గుగు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమీషన్‌కు ఏర్పాటు చేసింది.

సుప్రీం కోర్టులో విచారణ
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసెస్ పై దర్యాప్తునకు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస భట్టాఛార్య, జస్టిస్ జ్యోతిర్మయిలతో కూడిన కమిషన్‌ను సీఎం మమతాబెనర్జీ ఏర్పాటు చేసింది. అటు పెగాసస్ ఉదంతం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఎన్జీవో గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ పెగాసస్‌పై సుప్రీంతో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని దర్మాసనం విచారిస్తోంది. ప్రపంపనలు సృష్టించిన పెగాసస్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ జస్టిస్ రవీంద్రన్ నేతృతంలో ఓ స్వతంత్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వారికి విసృత అధికారాలను కూడా దర్మాసనం కల్పించింది.

పెగాసస్ దర్యాప్తుపై స్టే..
అయితే మమతాబెనర్జీ ప్రభుత్వం ఈ ఉదంతంపై మళ్లీ దర్యాప్తు మొదలు పెట్టినట్లు సుప్రీం దృష్టికి రావడంతో ఆ కమిషన్‌పై స్టే విధించింది. దీదీ సర్కారు తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం పెగాసస్‌పై ఎలాంటి దర్యాప్తు చేపట్టబోమని చెప్పి.. మళ్లీ ఇప్పుడు ఎంక్వైరీ ఎలా మొదలు పెడతారని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో దీదీ ప్రభుత్వం తరుపున వాదనలు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ సింఘ్వీని కోర్టుకు వివరణ ఇచ్చారు. పెగాసస్ హ్యాకింగ్ ఉదంతంపై సుప్రీం కోర్టు తీర్పువచ్చే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్ ఎలాంటి దర్యాప్తు చేయబోదని తెలిపారు. తీర్పు వెలువడిన తర్వాతే కమిషన్ దర్యాప్తు చేస్తుందని కోర్టుకు తెలిపారు. దీంతో పెగాసస్‌పై దీదీ సర్కార్ వేసిన దర్యాప్తు కమిషన్‌పై స్టే విధించింది సుప్రీంకోర్టు.












Click it and Unblock the Notifications