సుప్రీంకోర్ట్ సంచలన నిర్ణయం..!!

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గ్రీన్ బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చే పిటీషన్లు అన్నీ ఇక డిజిటల్ రూపంలో ఉండాలని ఆదేశించింది. న్యాయవాదులు పేపర్లతో రాకూడదని సూచించింది. పేపర్లతో కూడిన ఎలాంటి ఫైల్స్‌ను కూడా గ్రీన్ బెంచ్ సమక్షానికి తీసుకుని రాకూడదని పేర్కొంది. ఈ విషయంలో అవసరమైతే న్యాయవాదులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడానికీ సంసిద్ధతను వ్యక్తం చేసింది.

పేపర్ లెస్ బెంచ్‌ను ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టులో ఇదే తొలిసారి. అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇది. దీనికి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యాన్ని వహిస్తారు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ ధర్మాసనం వద్దకు ఇకపై వచ్చే విచారణలేవీ కాగితం రూపంలో ఉండబోవు. న్యాయవాదులెవరూ కాగితాలతో విచారణకు రావొద్దని జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు.

Supreme Court Constitution Bench Asks Lawyers To Not Bring Paper Files

ఈ విషయంలో న్యాయవాదులకు సాంకేతికంగా శిక్షణ ఇప్పించడానికీ తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఐటీ సెల్ ద్వారా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. టెక్నికల్‌గా ట్రైనింగ్ పొందాలనుకునే న్యాయవాదులు ప్రతి శనివారం ఈ ట్రైనింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందని చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు శిక్షణ తీసుకుని పేపర్ లెస్‌గా విచారణలను నిర్వహించడం కష్టతరమౌతుందంటూ బార్ కౌన్సిల్ అభిప్రాయపడగా- జస్టిస్ ఎంఆర్ షా తోసిపుచ్చారు.

ఈ విషయంలో తామూ శిక్షణ తీసుకుంటామని చెప్పారు. ఏదో ఒక రోజు న్యాయమూర్తులు కూడా పేపర్ లెస్ హియరింగ్‌ కోసం ట్రైనింగ్ తీసుకుంటారని జస్టిస్ ఎంఆర్ షా స్పష్టం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసులను వాదించగలిగే సామర్థ్యం ఉన్న అడ్వొకేట్లు.. సులభంగానే ట్రైనింగ్ పొందగలరని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం-లెప్టినెంట్ గవర్నర్ పిటీషన్‌పై విచారణ సమయంలో జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. క్రమంగా దీన్ని అన్ని బెంచ్‌లకు విస్తరించే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+