వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వ కళాశాలలకు నో 'నీట్'

|
Google Oneindia TeluguNews

వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన 'నీట్' పై కీలక తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టులో ఈ రోజు జరిగిన వాదనలను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. పరీక్ష నుంచి ప్రభుత్వ కళాశాలలను మినహాయిస్తూ తీర్పును ప్రకటించింది. నీట్ నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వైద్య కళాశాలలకు మినహాయింపునివ్వాలని ఎంసీఐ చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.

ప్రభుత్వ వైద్య కళాశాలలకు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం.. ప్రైవేటు కళాశాలకు మాత్రం నీట్ తప్పనిసరి అని చెప్పింది. తొలి విడుతలో నీట్ రాయనివారికి వెసులుబాటును కల్పిస్తూ రెండో విడుతలో నీట్ రాసుకోవచ్చని, అయితే.. తొలి విడుతలో పరీక్ష రాసినవారికి మలి విడుతలో అవకాశం ఇవ్వరాదని పరీక్షను నిర్వహిస్తోన్న సీబీఐఈ, తన తరుపు వాదనలు వినిపించింది.

 supreme court decision on neet

కాగా.. నీట్ కి సంబంధించి ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను, ప్రతిపాదనలను పరిగణలోకి శని ఆదివారాల్లో ఆ అంశాలపై చర్చ అనంతరం సోమవారం రోజున కేంద్రం తరుపున కోర్టుకు నివేదికను సమర్పించనుంది సొలిసిటరీ జనరల్. కేసుకు సంబంధించి తదుపరి విచారణను సోమవారం చేపట్టనుంది సుప్రీం కోర్టు.

English summary
supreme court taken a crucial decision over neet exam. in that decision supreme given exception to govt medical colleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X