జయలలితతో మాట్లాడండి సిద్దూ సార్: ప్రతిపక్షాలు

బెంగళూరు: కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని నిర్ణయించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. తాగు నీటిని రక్షించుకోవడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రతిపక్షాలు చెప్పాయి.

మేము మీకు మద్దతు ఇస్తున్నాం, మీ వెంట మేము ఉన్నాం, మీరు దేనికి భయపడనవసరం లేదని ప్రతిపక్ష నాయకులు జగదీష్ శెట్టర్, కే.ఎస్.ఈశ్వరప్ప (బీజేపీ), కుమారస్వామి (జేడీఎస్) సిద్దరామయ్యకు అండగా నిలిచారు.

తమిళనాడుకు నీరు కావాల ? వద్దా ? తాగు నీరు కోసం ఏం చెయ్యాలి ? న్యాయపోరాటం ఎలా చెయ్యాలి ? అంటూ శుక్రవారం ప్రత్యేక శాసన సభ సమావేశంలో పలువురు నాయకులు చర్చించారు.

Supreme Court directive to release water to Tamil Nadu

తాగు నీరు ముఖ్యం, అందుకే సుప్రీం ఆదేశాలు పక్కన పెట్టాం

మాకు తాగు నీరు ముఖ్యం. అందువలనే తాము సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించవలసి వచ్చిందని, అంతే కాని న్యాయస్థానం తీర్పును వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అందువలనే తాము సిద్దరామయ్యకు మద్దతు ఇస్తున్నామని వారు వివరించారు.

నీరు పాతళంలో ఉంది

కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమావతి డ్యాంల్లో 27.6 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అన్ని పార్టీల నాయకులు గుర్తు చేశారు. బెంగళూరు, మైసూరు, మండ్య జిల్లాల ప్రజలకు తాగు నీరు అందించాలంటే 32 టీఎంసీల కంటే ఎక్కువ నీరు ఉండాలని చెప్పారు.

Supreme Court directive to release water to Tamil Nadu

అందువలనే అందరూ కలిసి తమిళనాడుకు నీరు వదలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రైతుల కోసం కావేరీ నీరు వదిలిపెట్టాలని తమిళనాడు అంటున్నది, అయితే ఇక్కడ తాగు నీటి సమస్యను ఎలా పరిష్కరించాలో వారే చెప్పాలని ప్రశ్నించారు.

కావేరి జలాలు సహజ స్థితికి రావాలంటే 2017 మార్చి వరకు వేచిచూడాల్సిన పరిస్థి ఏర్పడిందని చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సిద్దరామయ్యకు సూచించారు. ఇక్కడి పరిస్థితిని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వివరించాలని, ఆమె మనస్సు మార్చడానికి ప్రయత్నించాలని, అందుకు సిద్దరామయ్య సిద్దంగా ఉండాలని ప్రతిపక్షాలు సూచించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+