వీధి కుక్కలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!
దేశవ్యాప్తంగా వీధి కుక్కలు, రహదారులపై తిరిగే పశువుల విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు.. క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలను వీధి కుక్కల రహిత ప్రాంగణాలుగా మార్చాలని స్పష్టం చేసింది. ఒక జాయింట్ డ్రైవ్ నిర్వహించి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని న్యాయస్థానం వెల్లడించింది. గతంలో రేబిస్ లక్షణాలు లేని కుక్కలను తిరిగి వదిలివేయచ్చని అనుమతించగా, ఇప్పుడు మాత్రం అవి మళ్లీ రోడ్లపైకి రాకుండా శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇటీవల వీధి కుక్కలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే జంతువుల కారణంగా ప్రమాదాలు, దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనల నేపధ్యంలో ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటూ ఈ తీర్పు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. కుక్కలను తరలించిన తర్వాత వాటికి తగిన ఆహారం, నీరు, వైద్యసదుపాయాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తీసుకుంటాయని కోర్టు తెలిపింది.

అలాగే కుక్కల కోసం ప్రత్యేక "ఫీడింగ్ జోన్‌లు" ఏర్పాటు చేయాలని సూచించింది. బహిరంగంగా ఆహారం ఇవ్వడం నిషేధమని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి పశువులను తక్షణమే పట్టుకుని షెల్టర్ హోమ్‌లకు తరలించాలని, వాటి సంరక్షణకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్ఏఐ (NHAI), స్థానిక సంస్థలు 8 వారాల్లోపు అమలు చేయాలని స్పష్టంచేసింది.
కాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో రేబిస్ మరణాలు పెరుగుతున్నాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని, గత ఆగస్టు 11న జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్‌ల ధర్మాసనం వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో కొత్త త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి ఇప్పుడు మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 13, 2026కు వాయిదా వేసింది. అప్పటివరకు అన్ని రాష్ట్రాలు కోర్టు ఆదేశాలను అమలు చేసిన పురోగతి వివరాలను సమర్పించాలని సూచించింది. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా వీధి జంతువుల నియంత్రణలో కొత్త దశ ప్రారంభం కానుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications