సుప్రీం కోర్టులో సుబ్రతా రాయ్‌కు తాత్కాలిక ఊరట

న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో శుక్రవారం నాడు తాత్కాలిక ఊరట లభించింది. గురువారం నాడు ఆయన తల్లి మరణించింది. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాలుగు వారాల పెరోల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది.

పెరోల్ సమయంలో ఆయన మఫ్టీలో ఉన్న పోలీసుల రక్షణలోనే ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సుబ్రతా రాయ్‌తో పాటు ఆయన అల్లుడు అశోక్ రాయ్‌కి కూడా న్యాయస్థానం నాలుగు వారాల పెరోల్ ఇచ్చింది.

Supreme Court Grants 4 Week Parole To Subrata Roy To Perform His Mother's Last Rites

సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అనే రెండు సంస్థలలో పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఆ సొమ్ము వెనక్కి ఇవ్వాల్న సుప్రీం ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో గత రెండేళ్లుగా సుబ్రతా రాయ్ జైలులో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+