సెప్టెంబర్27 నుండి సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్షప్రసారం... దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం!!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగే కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించడానికి సీజేఐ జస్టిస్ యు యు లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ సెప్టెంబర్ 27 నుండి విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

 సెప్టెంబర్ 27 నుండి సుప్రీం కోర్టులో విచారణలు లైవ్ స్ట్రీమింగ్

సెప్టెంబర్ 27 నుండి సుప్రీం కోర్టులో విచారణలు లైవ్ స్ట్రీమింగ్


మంగళవారం నాడు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులందరూ ఈ విషయంపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు 27 నుండి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించవచ్చని న్యాయమూర్తులు అంగీకరించారని, రాజ్యాంగ కేసులను రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చునని పేర్కొన్నారని సమాచారం.

కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని లేఖ రాసిన న్యాయవాది ఇందిరా జైసింగ్

కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని లేఖ రాసిన న్యాయవాది ఇందిరా జైసింగ్


గత వారం, సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ భారత ప్రధాన న్యాయమూర్తికి మరియు సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులకు ప్రజా మరియు రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై ప్రత్యక్ష ప్రసార ప్రక్రియలను ప్రారంభించాలని మరియు కోర్టు విచారణ తో పాటు కేసుకు సంబంధించి వాద, ప్రతివాద న్యాయవాదుల వాదనల శాశ్వత రికార్డును ఉంచాలని లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్ కోటా, హిజాబ్ నిషేధం, పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లతో సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని, 2018 తీర్పు ప్రకారం కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు.

జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసులను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వండి .. విజ్ఞప్తి

జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసులను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వండి .. విజ్ఞప్తి


సమాచార స్వేచ్ఛ మరియు న్యాయం పొందే హక్కు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కులో భాగమని, అందుకే విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆమె సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి 'ఫేక్ న్యూస్' ఎక్కువగా ప్రబలుతున్న కాలంలో ప్రత్యక్ష జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని ఆమె వెల్లడించారు. అందువల్ల, రియల్ టైం సమాచారం అత్యవసరమైనదని తెలిపారు. తన అభ్యర్ధన తరువాత, జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసులను లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించడానికి కోర్టుకు పదేపదే అభ్యర్థనలు వచ్చాయని జైసింగ్ అన్నారు.

సుప్రీం కోర్టులో కీలక కేసులు విచారణకు

సుప్రీం కోర్టులో కీలక కేసులు విచారణకు


ఈడబ్ల్యూఎస్ కోటా చట్టాన్ని సవాలు చేసే పిటిషన్‌లు, 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు పరిహారాన్ని పెంచడంపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్, దావూదీ బోహ్రా కమ్యూనిటీలో ఎక్స్-కమ్యూనికేషన్, మరియు కోలుకోలేని విచ్ఛిన్నం కారణంగా వివాహాలను రద్దు చేసే సుప్రీం కోర్టు అధికారం వంటి కేసులను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం ఉందని జై సింగ్ పేర్కొన్నారు.

 అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం

అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం


అత్యున్నత న్యాయస్థానానికి సొంత ఛానెల్ ఉండాలని, ఈలోగా, కోర్టు తన సొంత వెబ్‌సైట్‌లో, అలాగే యూట్యూబ్‌లో తన కార్యకలాపాలను ప్రసారం చేయడం ప్రారంభించవచ్చని జైసింగ్ చెప్పారు. తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ పదవీ విరమణ చేసిన రోజున కూడా ప్రత్యక్ష ప్రసారం చేశామని ఆమె తెలిపారు. గుజరాత్, ఒరిస్సా, కర్ణాటక, జార్ఖండ్, పాట్నా మరియు మధ్యప్రదేశ్ హైకోర్టులు తమ యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా తమ విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 27వ తేదీ నుండి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+