ఒడిశా బాలిక కిడ్నాప్, రేప్, హత్య కేసులో సీబీఐకి నోటీసు ఇచ్చిన సుప్రీం కోర్టు Newsreel

అయిదేళ్ల తన కుమార్తెను అపహరించి, అత్యాచారం చేసి చివరికి హత్య చేసిన కేసును సీబీఐతో విచారణ జరిపించాలని తల్లి సౌదామిని సాహూ చేసిన అభ్యర్థనను బుధవారం సుప్రీం కోర్టు బుధవారం విచారించింది. దీనిపై సీబీఐకి నోటీసు జారీ చేసింది.
తన కుమార్తె అత్యాచారం, హత్య కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ సౌదామిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనపై బదులివ్వాలంటూ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సీబీఐకి నోటీసు పంపించింది.
బాధితురాలైన మైనర్ బాలిక తరఫున సీనియర్ లాయర్లు మహేశ్ జెఠ్మలాని, రవి శర్మ సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు.
ఈ ఘటన ఒడిశాలోని నయాగఢ్‌లో గత ఏడాది జూలై నెలలో జరిగింది. అయిదేళ్ల తన కుమార్తెపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని సౌదామిని సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 14, 21 అధికరణల కింద రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ఆమె 32వ అధికరణం కింద ఈ పిటిషన్ వేశారు.
- త్రిపుర ఘటన గుర్తొస్తే ఇప్పటికీ నాకు నిద్ర పట్టదు.. అత్యాచార బాధితులను కలిసిన మహిళా రిపోర్టర్ అనుభవాలు
- అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా...

"సామాజికంగా వేధింపులకు, వెలివేతకు గురవడమే కాకుండా, చట్టాన్ని కాపాడాల్సిన సంస్థల నుంచి కూడా కష్టాలు తప్పకపోవడంతో ఆమెకు న్యాయం జరుగుతున్న నమ్మకం పోయింది" అని లాయర్లు మహేశ్ జెఠ్మలాని, రవిశర్మ తమ పిటిషన్లో పేర్కొన్నారు.
గత ఏడాది జూలై 14న తన కుమార్తెను ఇంటివద్ద ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశారని, తొమ్మిది రోజుల తరువాత బాలిక ఎముకల ముక్కలను మూటగట్టి తమ ఇంటికి సమీపంలోని చెత్త కుప్ప వద్ద విసిరేశారని పిటిషనర్ తెలిపారు. పోలీసు అధికారులు పిటిషనర్‌ను, వారి కుటుంబ సభ్యులను నేరస్తులుగా చూశారు. వారి పిటిషన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
రాష్ట్ర పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నందున, దీన్ని దర్యాప్తు చేసే బాధ్యతను వారికి అప్పగించకూడదని పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు.
ఇవి కూడా చదవండి:
- కోడి రామ్మూర్తి నాయుడు: 'కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- 'ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications