మాజీ ప్రధాని మనవడికి సుప్రీం కోర్టు నోటీసులు, ఎంపీ పదవికి ఎసరు ?, అక్రమ ఆస్తులు, ఈసీకే మోసం
న్యూఢిల్లీ/ బెంగళూరు: మాజీ ప్రధాని మనవడు, జేడీఎస్ పార్టీ లోక్ సభ సభ్యుడు (ఎంపీ) ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. బీజేపీ నాయకుడి అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో జేడీఎస్ నాయకులు షాక్ కు గురైనారు. ఎన్నికల కమిషన్ (ఈసీ)కే మాజీ ప్రధాని మనవడు మోసం చేశారని బీజేపీ నాయకుడు ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పటిషన్ దాఖలు చేశారు.

బీజేపీ నాయకుడి అర్జీలో ఏముందంటే !
మాజీ ప్రధాని మనవడు, జేడీఎస్ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ మీద బీజేపీ టిక్కెట్ తో పోటీ చేసిన బీజేపీ నాయకుడు ఎం. మంజు ఓడిపోయారు. తరువాత బీజేపీ నాయకుడు ఎం. మంజు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ను, ప్రజలను మోసం చేసి గెలిచారని, ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని మనవి చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈసీకి తప్పుడు సమాచారం, అక్రమ ఆస్తులు !
లోక్ సభ ఎన్నికల సందర్బంలో ఎన్నికల కమిషన్ కు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారని బీజేపీ నాయకుడు ఎం. మంజు ఆరోపిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాధిస్తున్నారని, అయితే ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఇచ్చిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని, తక్కువ ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను మోసం చేశారని ఆరోపించిన బీజేపీ నాయకుడు ఎం. మంజు కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు.

హై కోర్టులో బీజేపీ నాయకుడికి షాక్
బీజేపీ నాయకుడు ఎం. మంజు సమర్పించిన అర్జీని విచారణ చేసిన కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి మైకెల్ డి. కున్హా పిటిషన్ లో సరైన సమాచారం, వివరాలు లేవని అర్జీ విచారణ పిటిషన్ ను కొట్టి వేశారు. హైకోర్టులో అర్జీ విచారణ కొట్టి వేయడంతో బీజేపీ నాయకుడు ఎం. మంజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మీరే న్యాయం చెయ్యాలి !
మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తక్కువ ఆస్తులు చూపించారని, తప్పుడు ఆదాయం లెక్కలు చూపించి ఎన్నికల కమిషన్ ను మోసం చేశారని బీజేపీ నాయకుడు ఎం. మంజు ఆరోపించారు. తప్పుడు సమాచారంతో, అధికారం అడ్డం పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ప్రజ్వల్ రేవణ్ణను ఎంపీగా అనర్హుడిని చెయ్యాలని, మీరే తనకు న్యాయం చెయ్యాలని బీజేపీ నాయకుడు ఎం. మంజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మాజీ ప్రధాని, జేడీఎస్ లీడర్స్ కు షాక్ !
బీజేపీ నాయకుడు ఎం. మంజు అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు సమాధానం చెప్పాలని జేడీఎస్ ఎంపీ. ప్రజ్వల్ రేవణ్ణకు నోటీసులు జారీ చేసింది. తమ పార్టీ ఏకైక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడంతో జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, ఆయన అనుచరులు, జేడీఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు షాక్ కు గురైనారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications