వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుప్రీంకోర్టు

కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ విషయంపై జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పరిహారం ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో ఆరు వారాల్లోగా తేల్చాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ)కు సూచించింది.

https://twitter.com/ANI/status/1410105725670412292

''కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు చట్టబద్ధంగా ఎన్‌డీఎంఏ కనీస పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పరిహారం ఇవ్వని పక్షంలో, తన బాధ్యతలను నిర్వర్తించడంలో సంస్థ విఫలమైనట్టే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

న్యాయవాదులు గౌరవ్ బన్సాల్, రీపక్ బన్సాల్‌లు దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సమయంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ గౌరవ్, రీపక్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Supreme Court orders compensation to Covid19 families - Newsreel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X