బీజేపీకి ఊహించని షాక్: అన్నామలై బాటలోనే కీలక నేత.. పార్టీకి గుడ్‌బై!

తమిళనాడు బీజేపీ తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. అన్నామలై బీజేపీకి రాజీనామా చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే పార్టీకి చెందిన మరో కీలక నేత, తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్ రెడ్డి కూడా తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. అమర్ ప్రసాద్ రెడ్డి రాజీనామాతో బీజేపీతో ఆయనకు ఉన్న 13 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ముగిసింది. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో అత్యంత చురుకైన, ప్రముఖ ముఖాల్లో ఒకరిగా ఉన్న అమర్ ప్రసాద్ రెడ్డి వైదొలగడం ఆ పార్టీకి కోలుకోలేని పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

తన రాజీనామా నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అమర్ ప్రసాద్ రెడ్డి.. తాను అన్నామలై వైపే ఉంటానని స్పష్టం చేశారు. "నేను బీజేపీకి రాజీనామా చేశాను. నా భవిష్యత్తు రాజకీయ ప్రయాణంలో మా నాయకుడు అన్నామలైతో కలిసి నడుస్తాను. ఆయన సాగించే తదుపరి రాజకీయ పోరాటంలో నేను భాగస్వామిని అవుతాను" అని ఆయన పోస్ట్ చేశారు. అన్నామలై పార్టీ వీడిన తర్వాత తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలవుతున్నాయనే సంకేతాలను అమర్ ప్రసాద్ రెడ్డి కామెంట్స్ నిజం చేస్తున్నాయి.

Tamil Nadu BJP Crisis State Secretary Amar Prasad Reddy Resigns Following Annamalai Full Details

వాస్తవానికి తమిళనాడు బీజేపీలో సంక్షోభం అన్నామలై రాజీనామాతోనే మొదలైంది. అన్నామలై పార్టీని వీడిన కొన్ని గంటల్లోనే తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కరుణా నాగరాజన్‌తో పాటు మరో 15 మంది కీలక పదాధికారులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వరుస రాజీనామాలతో రాష్ట్రంలో పార్టీ మనుగడపై, అంతర్గత సమర్థతపై రాజకీయ విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ పరిస్థితులపై ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ.. అన్నామలై లేదా మరెవరు వెళ్లినా పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని మీడియా ముందు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

అమర్ ప్రసాద్ రెడ్డి వంటి బలమైన నేత హఠాత్తుగా తప్పుకోవడం బీజేపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీ రాష్ట్ర విభాగంలో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు, సంస్థాగత నిర్ణయాలపై ఉన్న అసంతృప్తులే ఈ వరుస రాజీనామాలకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు దక్షిణాదిలో బలపడాలని చూసిన బీజేపీకి, తమిళనాడులో వరుసగా కీలక నేతలంతా కమలం గూడును వీడటం పెద్ద సంస్థాగత ఎదురుదెబ్బగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+