రామజన్మభూమి వివాద పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ: 8 వారాల గడువు..

న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా న్యాయస్థానంలో నలుగుతూ వస్తోన్న అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనేది కూడా సుప్రీంకోర్టే ఖరారు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మధ్యవర్తిత్వాన్ని వహిస్తుంది.

మధ్యవర్తిత్వమే ఎందుకంటే

మధ్యవర్తిత్వం ద్వారా రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల రెండు వర్గాల ప్రజలకు కూడాఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంచనా వేశారు. మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులు అత్యంత గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ కేంద్రంగా ఈ కమిటీ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

Supreme Court Orders Mediation In Ayodhya Case

నాలుగు వారాల్లోగా మధ్యంతర నివేదికను, ఎనిమిది వారాల్లోగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించడం ద్వారా వచ్చిన అభిప్రాయానలను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా రికార్డు చేయాలని సూచించింది. అవసరం అనుకుంటే మధ్యవర్తిత్వ కమిటీ న్యాయ సేవలను పొందవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+