వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు లేటయిందా ? ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందే-సుప్రీంకోర్టు సంచలన తీర్పు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా నడుస్తున్న రైళ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఓ రైలు ఆలస్యంగా ప్రయాణించడం ద్వారా ప్రయాణికుడికి నష్టం కలిగితే మాత్రం రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో సాకులు వెతుక్కోవడానికి ఏమీ లేదని తెలిపింది.

ఓ రైలు ఆలస్యం తమ పరిధిలో లేని కారణాల వల్ల జరిగిందని రైల్వే అధికారులు నిరూపించలేకపోతే లేదా ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల సర్వీస్ లోపానికి రైల్వే శాఖ తమ ప్రయాణీకులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
"ఇవి పోటీ, జవాబుదారీతనం రోజులు. ప్రజా రవాణా మనుగడ సాగించాలి. అదే సమయంలో ప్రైవేట్ ప్లేయర్‌లతో పోటీ పడాల్సి వస్తే, వారు వ్యవస్ధాగత లోపాల్ని సరిదిద్దుకోవాలి. పౌరులు/ప్రయాణీకులు అధికారులు/పరిపాలన ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాగించడం లేదు. ఎవరైనా బాధ్యతను స్వీకరించాల్సిందే, "అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది.

Supreme court Orders to pay compensation to passengers if trains run late

2016 లో తన కుటుంబంతో జమ్మూ వెళ్తున్నప్పుడు రైలు నాలుగు గంటలు ఆలస్యంగా ప్రయాణించడంతో సదరు ప్రయాణికుడికి జరిగిన నష్టానికి పరిహారం అందించాల్సిందేనని రైల్వేశాఖను ఆదేశించింది. రైలు ఆలస్యం కారణంగా పిటిషనర్ తమ విమానం ఎక్కలేకపోయారు. అలాగే ఖరీదైన టాక్సీలో శ్రీనగర్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో పాటు వారు దాల్ సరస్సులో పడవ బుకింగ్ కూడా కోల్పోయారు. దీనిపై సదరు ప్రయాణికుడు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. రైల్వే ద్వారా సేవలో లోపంగా దీనిని భావించింది పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. వినియోగదారుల ఫోరం నార్త్ వెస్ట్రన్ రైల్వేకి టాక్సీ ఖర్చుల కోసం రూ.15,000, బుకింగ్ ఖర్చుల కోసం రూ.10,000, మానసిక వేదన మరియు వ్యాజ్యాల ఖర్చుల కోసం రూ. 5,000 చెల్లించాలని ఆదేశించింది.

కశ్మీర్ లోని వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రైల్వేశాఖ రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని ఆశ్రయించింది. అయినా ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
రైల్వే తరఫున అదనపు సొలిసిటర్-జనరల్ ఐశ్వర్య భాటి, ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు రైల్వే సేవలో లోపం అని చెప్పలేమని సమర్ధించారు. భారతీయ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ యొక్క రూల్ 114 మరియు రూల్ 115 లను ఆమె ఉటంకించారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందుకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వేకు ఉండదని చెప్పింది.
"రైళ్ల ఆలస్యం మరియు ఆలస్యంగా నడపడానికి అనేక కారణాలు ఉండవచ్చు" అని అత్యున్నత న్యాయ అధికారి వాదించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ వాదలనలను తోసిపుచ్చుతూ సదరు ప్రయాణికుడికి పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

"జమ్మూలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పేందుకు తగిన ఆధారాలు ఏవీ లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. రైల్వేలు తమ సర్వీసుల ఆలస్యానికి తగిన కారణం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం బెంచ్ పేర్కొంది. తమ పరిధిలో లేని కారణాల వల్ల ఆలస్యం జరిగిందని నిరూపించుకోవాలని లేదా కనీసం రైల్వేలు ఆలస్యానికి హేతుబద్ధమైన కారణాలను చెప్పాల్సిన అవసరం ఉందని, కానీ రైల్వే అందులో విఫళమైందని సుప్రీంకోర్టు పేర్కొంది.

English summary
The Supreme Court on today orders compensation for passengers who are in late running trains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X