Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాన్ కార్డుకి ఆధార్ అనుసంధానంపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు!

ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే ఇచ్చింది. వ్యక్తిగత వివరాలు చోరీకి గురవకుండా తగిన విధానం రూపొందించే వరకు ఆధార్ తో పాన్ కార్డు .

న్యూఢిల్లీ: వ్యక్తిగత వివరాలు చోరీకి గురవకుండా తగిన విధానం రూపొందించే వరకు ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం పాక్షికంగా స్టే ఇచ్చింది.

ప్రభుత్వ పథకాల వర్తింపునకు ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకులో ఖాతా ప్రారంభించాలన్నా, స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇలా ప్రతిదానికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ పోతున్నాయి.

Supreme Court partially stays law making Aadhaar mandatory for PAN, ITR filing

మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు వేస్తూ పోతోంది. ఆధార్ కార్డుల వివరాలు హ్యాకింగ్ కు గురైనట్లు ఆమధ్యన అందరూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత వివరాలు చోరీకి గురవకుండా తగిన విధానం రూపొందించే వరకు ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం పాక్షికంగా స్టే ఇచ్చింది.

వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడే వరకు ఈ స్టే అమలులో ఉంటుందని, ఆ తీర్పును అసుసరించి ఇప్పుడిచ్చిన తీర్పుకు సవరణలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్రతి వ్యక్తి ఆదాయ వివరాలు అందజేయాలని, అందుకు పాన్ కార్డు వినియోగించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం మాత్రం ప్రస్తుతానికి అవసరం లేదని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+