హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Serial killer: కిరాతకుడు ఉమేష్ రెడ్డి ఉరిశిక్షను రద్దు చేసిన సుప్రీం కోర్టు, 17 హత్యలు, 20 రేప్ లు, అయితే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: మహిళల మీద అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్, మాజీ పోలీసు ఉమేష్ రెడ్డికి హైకోర్టు విదించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఉమేష్ రెడ్డి కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ అనేక మంది మహిళల మీద అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగిన మహిళలను కిరాతకంగా హత్య చేశాడు. ఉమేష్ రెడ్డికి తరువాత పోలీసు ఉద్యోగం పోయి అరెస్టు అయ్యాడు. ఉమేష్ రెడ్డి మీద 17 హత్యలు, 20 రేప్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అనేక కేసుల నుంచి ఉమేష్ రెడ్డికి విముక్తి లభించింది. అయితే బెంగళూరులో విదవ మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఉమేష్ రెడ్డి అడ్డంగా చిక్కిపోయి జైలుకు వెళ్లాడు. ఇదే కేసులో ఉమేష్ రెడ్డికి ఉరిశిక్షపడింది.

Lady: భర్తకు గుడ్ బై, ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ముగ్గురు కూతుర్ల తల్లి, వీడియోలు తీసి వైరల్ చేసి ?Lady: భర్తకు గుడ్ బై, ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ముగ్గురు కూతుర్ల తల్లి, వీడియోలు తీసి వైరల్ చేసి ?

పోలీసు ఉద్యోగం అడ్డం పెట్టుకుని

పోలీసు ఉద్యోగం అడ్డం పెట్టుకుని

బిఏ. ఉమేష్ రెడ్డి అలియాస్ ఉమేష్ రెడ్డి అనే వ్యక్తి కర్ణాటక పోలీసు శాఖలో కానీస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. ఉమేష్ రెడ్డి కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ కర్ణాటకలోని అనేక జిల్లాల్లో చాలా మంది మహిళల మీద అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగిన మహిళలను కిరాతకంగా హత్య చేసి ఉమేష్ రెడ్డి కొన్ని సంవత్సరాలు ఎవ్వరికి చిక్కకుండా దర్జాగా తిరిగేశాడు.

బెంగళూరులో ఏం చేశాడంటే ?

బెంగళూరులో ఏం చేశాడంటే ?

1998 ఫిబ్రవరి 28వ తేదీన బెంగళూరు నగరంలోని పిణ్యా పోలీస్ స్టేషన్ పరిధిలో విదవ మహిళకు దెయ్యం పట్టిందని ఆమె కొడుకుకు చెప్పి ఆమెను నగ్నంగా చేసిన ఉమేష్ రెడ్డి అత్యాచారం చేశాడు. ఆ సందర్బంలో మహిళ ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా హత్య చేసి పరారైనాడు. బాధితురాలి కొడుకు కేసు పెట్టాడు. పిణ్యాలో జరిగిన మహిళ అత్యాచారం, హత్య కేసులో ఉమేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

విచారణలో షాకింగ్ విషయాలు

విచారణలో షాకింగ్ విషయాలు

ఉమేష్ రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేసిన అప్పటి పిణ్యా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బిఎన్, న్యామేగౌడ కామాంధుడి మ్యాటర్ మొత్తం బయటకులాగారు. ఉమేష్ రెడ్డి అరచకాలు వెలుగు చూడటంతో పోలీసులు హడలిపోయారు. ఉమేష్ రెడ్డి కానీస్టేబుల్ ముసుగులో అనేక మందిని హత్య చేశాడని, అతను సీరియల్ కిల్లర్ అని వెలుగు చూడటంతో సామాన్య ప్రజలు బిత్తరపోయారు.

 ఉరిశిక్ష విధించిన కర్ణాటక హైకోర్టు

ఉరిశిక్ష విధించిన కర్ణాటక హైకోర్టు


ఉమేష్ రెడ్డి మీద 17 హత్యలు, 20 రేప్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అనేక కేసుల నుంచి ఉమేష్ రెడ్డికి విముక్తి లభించింది. బెంగళూరులోని పిణ్యాలో జరిగిన విదవ మహిళ మీద అత్యాచారం, హత్య చేసిన కేసులో ఉమేష్ రెడ్డికి విరుద్దంగా బలమైనసాక్షాలు చిక్కాయి. ఇదే కేసులో 2006లో ఉమేష్ రెడ్డికి ఉరిశిక్షపడింది.

తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసిన కిల్లర్

తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసిన కిల్లర్

కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉమేష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. రెండుసార్లు సుప్రీం కోర్టులో ఉమేష్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్, రాష్ట్రపతి కూడా ఉమేష్ రెడ్డి క్షమాభిక్షను తిరస్కరించారు. అయితే క్షమాభిక్షపత్రం పరిశీలించడంలో ఆలస్యం చేశారని ఉమేష్ రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

ఉరిశిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు

ఉరిశిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు

2006 నుంచి జైల్లో ఏకాకిగా శిక్ష అనుభవిస్తున్న ఉమేష్ రెడ్డికి విధించిన ఉరిశిక్షను రద్దు చేసిన సుప్రీం కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విదించింది. ఉమేష్ రెడ్డి చచ్చే వరకు జైల్లోనే ఉండాల్సి ఉంది. అయితే ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో అతని చేతిలో హత్యలకు గురైన బాధితుల కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Serial killer BA Umesh alias Umesh Reddy, who was a monster to women, has escaped the death sentence . In other words, the Supreme Court canceled the order of the High Court which had fixed the death penalty for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X