ఇదీ తొందరపాటే: సుప్రీంలో విభజనపై పిటిషన్ల కొట్టివేత

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టి వేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అపరిపక్వ దశలో ఉన్న పిటిషన్ల పైన విచారణ చేపట్టలేమని, గతంలో వేసిన పిటిషన్లకు ఇప్పటికీ తేడా లేదని పేర్కొంది. పిటిషన్లపై విచారణకు ఇది సరైన సమయం కాదని తెలిపింది. ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు. అదే సమయంలో సరైన సమయంలో కోర్టుకు రావాలని సూచించింది. విభజనపై న్యాయవాదులు చేసిన వాదనలను జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డేతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దాదాపు గంటన్నరపాటు వాదనలు జరిగాయి.

అంతకుముందు విభజనపై దాఖలైన పిటిషన్ల పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాదులు మోహన్ లాల్ శర్మ, నారీమన్‌లు వాదనలు వినిపించారు. నారీమన్ తన వాదనలు వినిపిస్తుండగా... శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో తెలంగాణ ఆప్షన్ ఉందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విభజనకు వ్యతిరేకంగా దాఖలైన తొమ్మిది పిటిషన్లను సుప్రీం విచారణకు ఒకేసారి స్వీకరించిన విషయం తెలిసిందే.

మొదట మోహన్ లాల్ శర్మ తన వాదనలను వినిపించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాక రాజకీయ నాయకులకు జోక్యం చేసుకునే అవకాశం ఉండదని ఈ సందర్భంగా శర్మ తెలిపారు. ఆర్టికల్ 3ని ఇష్టానుసారం ఉపయోగించుకుంటే రాజ్యాంగ సమగ్రతకు అర్థం ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో రాష్ట్రపతి, పార్లమెంటు అధికారాలపై కోర్టులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇరు ప్రాంతాలు విభజనకు అంగీకరిస్తే అభ్యంతరం లేదని, అసెంబ్లీ అంగీకరించకుంటే దాని పరిస్థితి ఏమిటన్నారు.

Supreme Court questions Nariman about Telangana option

371 డి, 371ఈలు కేంద్రానికి వర్తిస్తాయి కాబట్టి ఎపి విభజన అసాధ్యమన్నారు. బిల్లును సిఫార్సు చేసే పూర్తి అధికారం రాష్ట్రపతికి ఉందన్నారు. అసెంబ్లీకి పంపిన బిల్లు సమగ్రంగా లేదని, కొత్త ఏర్పాటు లక్ష్యం, కారణాలు బిల్లులో పొందుపర్చలేదని, హోంమంత్రిత్వ శాఖను వివరాలు అడిగినా ఇవ్వలేదని చెప్పారు.

రాష్ట్రం అంగీకారం లేకుండా విభజిస్తే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసినట్లే అన్నారు. రాష్ట్రం అంగీకారం లేకుండా ఎక్కడా రాష్ట్రం ఏర్పడలేదని, ఫెడరలిజం స్ఫూర్తిని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందన్నారు. బిల్లు గురించి పూర్తి వివరాలు అడిగితే ఇవ్వలేమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసిందని చెబుతూ, ఆధారాలు అందజేశారు.

నారీమన్ వాదనలు...

371 డి అమలులో ఉండగా రాష్ట్రాన్ని ఎలా విభజించడం కుదరదని నారీమన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిలిపివేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం హడావుడిగా రాజ్యాంగ విభజనకు పూనుకుందన్నారు. ఆర్టికల్ 3 పైన స్పష్టత ఇవ్వాలని కోరారు. శ్రీకృష్ణ కమిటి ఇచ్చిన నివేదికను పార్లమెంటులో పెట్టలేదన్నారు.

తెలంగాణకు రీజినల్ కమిటీని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో పేర్కొందన్నారు. ఆరో ఆప్షన్‌గా సమైక్య రాష్ట్రాన్ని ఉంచాలని సూచించిందన్నారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు.. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఆప్షన్లలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉందా అని ప్రశ్నించారు. విభజన బలవంతంగా జరుగుతోందని, అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది డ్రాఫ్ట్ బిల్లు మాత్రమేనని మరో న్యాయవాది శ్యామల అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+