ఎద్దుల పోటీలు: స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు, ప్రభుత్వం ఆదేశాలు, సిద్దూ!
బెంగళూరు: కర్ణాటకలో జంట ఎద్దుల పోటీలు నిర్వహణపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కర్ణాటకలో సాంప్రధాయబద్దంగా నిర్వహించే జంట ఎద్దుల పోటీలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన స్వచ్చంద సంస్థకు చెక్కెదురైయ్యింది.
కర్ణాటకలో ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో జంట ఎద్దులతో నీటిలో పోటీలు నిర్వహిస్తారు. బురదనీటిలో జంట ఎద్దుల పోటీ నిర్వహించడం కన్నడిగులకు సాంప్రధాయంగా వస్తోంది. అయితే జంతువులను హింసిస్తున్నారని, ఈ పోటీలు రద్దు చెయ్యాలని ఫియోపో (FIAPO)అనే స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

జంట ఎద్దుల పోటీలు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం చట్టబద్దత కల్పించింది. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం పిటిషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మార్చి 14వ తేదీన తుదివిచారణ ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications