మోడీకి ఊరట, నోట్ల రద్దుపై స్టేకు సుప్రీం నో, కానీ..
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన సుప్రీం కోర్టు మంగళవారం నాడు స్పందించింది. నోట్ల రద్దు పైన స్టే విధించేందుకు నిరాకరించింది. అదే సమయంలో పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడవద్దని వ్యాఖ్యానించింది.
ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు పైన స్టే విధించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది. నోట్ల రద్దు పైన అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, అలా జరగకుండా చూడాలన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications