
దీపావళి: బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు నో
దీపావళి పండగ సందర్భంగా పటాసులు కాల్చడం కామనే. కానీ పర్యావరణానికి హానీ కలుగుతుందని మేధావులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే పొల్యూషన్ మాములుగా ఉండదు. అందుకోసమే నిషేధం విధించాలని కోరుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పటాసుల పేల్చడంపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టును పర్యావరణ వేత్తలు ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం దానిని తిరస్కరించింది. తాము ఇదివరకు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తమ ఉత్తర్వులు స్పష్టం చేశామని తెలిపింది.

చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి. చిమ్మ చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించింది. అందుకోసమే అంతా దీపం వెలిగించి, కాకరవొత్తులు కాలుస్తారు. అయితే కాలుష్య కారకం అయిన పటాసులు, బాణాసంచా కాల్చడంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ఒకసారి కోర్టు బ్యాన్ వేసింది. మరోసారి పండగ నేపథ్యంలో ఎత్తివేసింది.