మార్పుల్లేవ్: గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ నిబంధనల మార్పునకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, బెయిల్ నిబంధనలు సడలించాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సడలింపుల్లేవ్
గాలి పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు.. ఆయన తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించలేదు. బెయిల్ నిబంధనలు సడలించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2011లో అరెస్ట్
అనంతపురం జిల్లా పరిధిలో ఓఎంసీ కంపెనీల గనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన సీబీఐ.. 2011, సెప్టెంబర్ 5న గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసింది.

ఆంక్షలతో బెయిల్
ఆ తర్వాత మూడేళ్ల పాటు జైలు జీవితం గడిపిన జనార్ధన్‌రెడ్డికి 2015, జనవరి నెలలో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆంక్షలు విధించింది.

మొత్తం 13కేసుల్లో..
ఈ నిబంధనలను సడలించాలంటూ సోమవారం సుప్రీంకోర్టును గాలి జనార్ధన్‌రెడ్డి ఆశ్రయించారు. గాలి జనార్ధన్ రెడ్డిపై అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ, లోకాయుక్త పరిశీలనలో మొత్తం 13కేసులు ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications